పవన్ కల్యాణ్‌తో జతకట్టే ఆలోచనలో ఉన్నాం

పవన్ కల్యాణ్‌తో జతకట్టే ఆలోచనలో ఉన్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Last Updated : Feb 28, 2018, 10:16 AM IST
పవన్ కల్యాణ్‌తో జతకట్టే ఆలోచనలో ఉన్నాం

పవన్ కల్యాణ్‌తో జతకట్టే ఆలోచనలో ఉన్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తమ లాంటి ఆలోచనలే కలిగిన జనసేనతో కలిసి ముందుకు నడిచేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. మంగళగిరిలో జరుగుతున్న గుంటూరు జిల్లా సీపీఐ 24వ మహాసభల ప్రతినిధుల సభకు హాజరైన ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. 

వచ్చే ఎన్నికల్లో ప్రజా అజెండాతో ముందుకొచ్చే వారితో కలిసి నడుస్తామని ఆయన స్పష్టం చేశారు. పవన్ కూడా తమ ఆలోచనా విధానంలోనే నడుస్తున్నారని, ఆయనతో కలిసి ముందుకువెళ్లాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కడపలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని.. అనంతరం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి, ఈ విషయంపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. అయితే, ఎవరితో కలిసి ముందుకు వెళ్లే విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రధాని మోదీ పూచిక పుల్లలా చూస్తున్నారని విమర్శించారు.

Trending News