Nara Lokesh slams CM Jagan: జగన్‌పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh slams AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంశాల్లో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేదని ఆరోపించిన లోకేష్.. ఆయన జనాన్ని ప్రలోభపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 06:32 PM IST
  • ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేష్ సంచలన ఆరోపణలు
  • అందుకే ఉన్నట్టుండి 3 రాజధానులు బిల్లును ఉపసంహరించుకున్నారని వ్యాఖ్యలు
  • ఏమీ తెలియకుండానే జగన్ సీఎం అయ్యారని వ్యాఖ్యలు
Nara Lokesh slams CM Jagan: జగన్‌పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh slams AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంశాల్లో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేదని ఆరోపించిన లోకేష్.. ఆయన జనాన్ని ప్రలోభపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. అందుకే గతంలో అమరావతి రైతుల (Amaravati farmers) నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా ఆ బిల్లును ఉపసంహరించుకున్నారని ఎద్దేవా చేశారు. 

ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఏం జరిగిందో అందరూ చూశారన్న నారా లోకేష్.. అసెంబ్లీలో తన తల్లి నారా భువనేశ్వరికి (Nara Bhuvaneshwari) జరిగిన అవమానంతో ప్రభుత్వం అప్రతిష్టపాలైందని, అందుకే ఆ వివాదంపై నుంచి జనం దృష్టిని మరల్చేందుకే ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును ఉహసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించారని ఆరోపించారు.

nara-lokesh-vs-ap-cm-ys-jagan-mohan-reddy-andhra-pradesh.jpg

మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనతో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రజల మధ్య ఆగ్రహావేశాలు రెచ్చగొట్టి ప్రాంతీయ చిచ్చు పెట్టారని నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా మూడు రాజధానులు (Three capital bill latest updates) ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఆర్బాటంగా ప్రకటించినప్పటికీ.. విశాఖపట్నం, కర్నూలు, అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.

Also read : Ayyanna patrudu: నర్సీపట్నంలో ఉద్రిక్తత...నడిరోడ్డుపై అయ్యన్న ధర్నా..

మూడు రాజధానుల పేరుతో అమరావతిని అభివృద్ధిని చేయకుండా వదిలేసిన అధికార పార్టీ.. కనీసం విశాఖపట్నం, కర్నూలును కూడా అభివృద్ధి చేయలేదని నారా లోకేష్ (Nara Lokesh vs AP CM YS Jagan) ఆరోపించారు. 

Also read: Kondapalli Municipality Election: హైకోర్టు జోక్యంతో పూర్తైన కొండపల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News