2003లో టీమిండియా ప్రపంచ కప్ లో రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే..! దక్షిణాఫ్రికాతో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడింది. క్రికెట్ నుంచి రిటైర్ అయిన గంగూలీ తాజాగా తన ఆత్మకథ 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించిన ఆసక్తికర విషయం చెప్పాడు.
ఇది కూడా చదవండి: అతనివల్ల నా కెరీర్ సర్వ నాశనం అయ్యింది.. గంగూలీ
2003 వరల్డ్ కప్ కంటే ముందు నుంచే యువ ఆటగాళ్ల కోసం వెతకడం ప్రారంభించా. ఒత్తిడిని జయించి జట్టుకు విజయం అందించే ఆటగాళ్ల కోసం అన్వేషించా. ఆ సమయంలో ధోనీ నా కంటపడ్డాడు. నాకు కావాల్సిన లక్షణాలన్నీ ధోనీలో ఉన్నాయని అనిపించాయి. దీంతో జట్టులోకి రమ్మని 2003 వరల్డ్ కప్ సమయంలోనే ధోనీని అడిగా. అప్పుడు ధోనీ 'నేను ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్నా. జట్టులోకి ఎలా వచ్చేది' అని అన్నాడు. దాంతో నేను షాకయ్యా. అయితే 2004లో నా సలహాను ధోనీ సీరియస్‌గా తీసుకున్నాడు. జట్టులోకి వచ్చిన నాటి నుంచే ధోనీ ఒక మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేను తనపై పెట్టుకున్న నమ్మకాన్ని 2011లో వరల్డ్ కప్ జయించి నిలబెట్టాడు' అని గంగూలీ తన ఆత్మకథలో వివరించారు.