Stock Market Updates: ఒమిక్రాన్ భయాలు కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్లు ఇటీవలి నష్టాల నుంచి తేరుకున్నాయి. గురువారం సెషన్లో సూచీలు లాభాలను నమోదు (Stocks Closing bell) చేశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 113 పాయింట్లు పెరిగి.. 57,901 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 27 పాయింట్ల లాభంతో 17,248 వద్ద స్థిరపడింది. ఐటీ, ఆర్థిక షేర్లు రాణించగా.. ఆటో, ఫార్మా షేర్లు డీలా పడ్డాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 59,203 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 58,242 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,639 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,355 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 15 కంపెనీలు సానుకూలంగా స్పందించగా.. 15 కంపెనీలు డీలా పడ్డాయి.
బజాజ్ ఫినాన్స్ (2.82 శాతం), ఇన్ఫోసిస్ (2.45 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.76 శాతం), టైటాన్ (1.52 శాతం), హెచ్‌సీఎల్‌టెక్ (1.32 శాతం) లాభాలను గడించాయి.
బజాజ్ ఆటో (1.44 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.37 శాతం), సన్‌ఫార్మా (1.36 శాతం), మారుతీ (1.25 శాతం), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.94 శాతం) నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), థైవాన్, హాంకాంగ్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 76.09 వద్ద కొనసాగుతోంది.
Also read: Apple Bonus: యాపిల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం బోనస్‌గా రూ.76 వేలు!
Also read: Jio Rs 1 Plan: అతి చౌకైన ప్లాన్ ప్రవేశపెట్టిన జియో.. Rs.1 తో రీచార్జ్.. ఇందులో ఏం ఉండనున్నాయంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook