Baba Vanga 2022 predictions: 2022లో చాలా విపత్తులు.. కొత్త వైరస్ పుట్టుక.. ప్రపంచం అతలాకుతలం..

Baba Vanga predicted for 2022 : 2022లోకి మనం ఎంటర్ కాబోతున్నాం. ఈ నేపథ్యంలో బాబా వంగా ప్రిడిక్షన్ ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఒమిక్రాన్ భయంతో 2022లోకి అడుగుపెట్టబోతోన్న ప్రపంచం మరికొన్ని ఉపద్రవాలను కూడా ఎదుర్కోనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 10:16 PM IST
  • బాబా వంగా అంచనాలన్నీ నిజం
  • చాలా విపత్తులను ముందే అంచనా వేసిన బాబా వంగా..
  • 2022లో మరికొన్ని ఉపద్రవాలు రానున్నాయని ముందే చెప్పిన బాబా వంగా
Baba Vanga 2022 predictions: 2022లో చాలా విపత్తులు.. కొత్త వైరస్ పుట్టుక.. ప్రపంచం అతలాకుతలం..

Baba Vanga predictions: New Virus, Tsunami, Alien Attack: Blind Mystic Baba Vanga predictions for 2022 year: కొంత మంది చెప్పే విషయాలు కచ్చితంగా నిజం అవుతుంటాయి. భవిష్యత్తుకు జరగబోయే చాలా విషయాలు వారు ముందే చెప్పి ఉంటారు... అలాంటి సంఘటనలన్నీ జరగుతూ ఉంటాయి కూడా. అలా భవిష్యత్తులో జరిగే విషయాలు.. ముందుస్తుగా చెప్పిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు... బాబా వంగా. ఆమె ఒక అంధురాలు.. 1996లో మరణించారు. బల్గేరియన్ చెందిన బాబా వంగా ( Baba Vanga) అంచనాలన్నీ నేటికీ నిజమవుతున్నాయి. బాబా వంగా చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే చాలా జరిగాయి. 

అంధురాలైన బాబా వంగా తన అతీంద్రియ శక్తులతో ప్యూచర్‌‌లో జరగబోయే విషయాలన్నీ ముందే చెప్పేశారు. అవన్నీ కూడా సేమ్ ఆమె చెప్పిన విధంగానే జరిగాయి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత గురించి బాబా వంగా ముందే అంచనా వేశారు. బ్రెగ్జిట్ లాంటి ప్రపంచ ఘటనల గురించి ముందుగానే జోస్యం చెప్పారు బాబా వంగ. 5079 సంవత్సరం వరకు జరగబోయే పలు ముఖ్య ఘటనలను ముందే ఆమె చెప్పారు. ఆమె అంచనాలలో 85% వరకు విజయవంతం అయ్యాయి. 1911లో జన్మించిన వంగా, 12 ఏళ్ల వయస్సులోనే ఒక భారీ తుపాన్ వల్ల తన కంటి చూపును కోల్పోయింది.

2022లో (2022 year) ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నాము. అయితే, బాబా వంగా ప్రకారం.. వచ్చే ఏడాది కూడా కష్టాల తప్పవట. మరికొన్ని రోజుల్లో 2022లోకి మనం ఎంటర్ కాబోతున్నాం. ఈ నేపథ్యంలో బాబా వంగా ప్రిడిక్షన్ (Baba Vanga’s Prediction) ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఒమిక్రాన్ భయంతో 2022లోకి అడుగుపెట్టబోతోన్న ప్రపంచం మరికొన్ని ఉపద్రవాలను కూడా ఎదుర్కోనుంది.

బాబా వంగా ప్రకారం.. 2022లో జరగబోయే కొన్ని ఘటనలు :

మరిన్ని భూకంపాలు సునామీలు : (More earthquakes and tsunamis)

బాబా వంగా (Baba Vanga) ప్రకారం.. 2022లో ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు, సునామీలు తలెత్తే అవకాశం ఉంది. గతంలో 2004లో కూడా సునామీ వస్తుందని బాబా వంగా ముందే అంచనా వేశారు. అలాగే ఆస్ట్రేలియాతో పాటు అనేక ఆసియా దేశాలు తీవ్రమైన యుద్ధాల బారిన పడతాయని అంచనా వేశారు. ఇండియన్ మహాసముద్రంలో ఏర్పడే సునామీ వల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, భారతదేశం పాటు పలు ప్రపంచ దేశాల తీర ప్రాంతాల్లో పెద్ద పెద్ద సునామీలు వచ్చే ప్రమాదముందట.

Also Read : Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ ఇయర్​ ఎండ్ సేల్​- స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

సైబీరియాలో ఘోరమైన వైరస్: (Deadly virus in Siberia)

బాబా వంగా ప్రకారం.. సైబీరియాలో మరో ప్రాణాంతక వైరస్‌ పుట్టుకొస్తుందట. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం వల్ల ఈ వైరస్‌ విజృంభిస్తుందని బాబా వంగా అంచనా వేశారు. 

భారత్‌పై మిడతల దాడి: (Massive locust attack in India)

భారత్‌పై 2022లో మిడతల దాడి ఉండనుందని బాబా వంగా చెప్పారు. ఆ భారీ మిడతల గుంపు పంటల్ని నాశనం చేస్తుందట. దీనివల్ల కరువు సంభవిస్తుందని బాబా వంగా అంచనా వేశారు. 

గ్రహాంతరవాసుల దాడి: (Alien attack)
బాబా వంగా ప్రకారం.. భూమిపైకి కొన్ని గ్రహాంతరవాసులు వస్తాయట. ఒమువామువా అనే ఆస్టరాయిడ్ నుంచి భూమిని చూసేందుకు ఏలియన్లు వస్తారని బాబా వంగా చెప్పారు. 

తీవ్రమైన నీటి కొరత: (Water scarcity)

2022లో ప్రపంచంలోని చాలా నగరాల్లో తాగునీటి కొరత ఏర్పడుతుందట. నదుల కాలుష్యం పెరగుతుందని బాబా వంగా అంచనా వేశారు. 

వర్చువల్ రియాలిటీ టేకోవర్ : (Virtual Reality takeover)
2022లో (2022 year) చాలా మంది ఎక్కువ సమయాన్ని ఫోన్‌లు, ఇతర గాడ్జెట్‌లలోనే గడుపుతారు. జనాలంతా ఎక్కుగా స్క్రీన్‌ల ముందే సమయాన్ని గడుపుతారు. దీంతో ఫాంటసీ..రియాలిటీకి మధ్య తేడా గ్రహించలేక గందరగోళానికి గురవుతారట.

Also Read : Rajamouli: రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్టులో ఆ ఇద్దరి హీరోలు ఫిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News