India Covid Cases Today: ఇండియా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,47,417 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే 27 శాతం ఎక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా ధాటికి దేశంలో మరో 380 మంది మరణించారు.
మరోవైపు 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరింది.
#UPDATE | 380 COVID patients lost lives in India in the last 24 hours, taking the death toll to 4,85,035: Union Health Ministry
— ANI (@ANI) January 13, 2022
దేశంలో కరోనా వ్యాప్తి
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,63,17,927 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,85,035 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 34,715,361 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 85,26,240 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,53,80,08,200 కు చేరింది.
ప్రపంచంలో కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 31,45,916 మందికి వైరస్ సోకింది. 8,032 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు -- నమోదవ్వగా 31,75,55,259కి కరోనా మరణాలు 55,30,352కు చేరాయి.
Also Read: Maharashtra Corona Cases: మహారాష్ట్రలో పెరిగిన కరోనా కేసులు.. 46,723 కొత్త కేసులు, 32 మరణాలు
Also Read: Corona in India: ముంబయిలో తగ్గిన కరోనా కేసులు- ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook