Woman raped in a Lodge in Hyderabad: ఆమె భర్త గంజాయి కేసులో జైలుకు వెళ్లాడు.. అతన్ని విడిపించేందుకు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తోచలేదు.. ఇంతలో భర్త స్నేహితుడు ఒకరు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు.. బెయిల్ వచ్చే మార్గం చెబుతానని ఆమెను ఓ లాడ్జికి పిలిపించాడు... అక్కడ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... బాలానగర్‌లో నివాసం ఉండే ఓ మహిళ భర్త గతేడాది గంజాయి కేసులో అరెస్టయి జైలుకెళ్లాడు. అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఏం చేయాలో తెలియక అతని భార్య నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఇదే క్రమంలో ఓరోజు ఆమె భర్త స్నేహితుడైన ఆటో డ్రైవర్ జహంగీర్.. వారి ఇంటికి వెళ్లాడు. నీ భర్తను బెయిల్‌పై బయటకు తీసుకొస్తానని... లాయర్‌ను కూడా తానే మాట్లాడుతానని ఆమెతో చెప్పాడు.
ఆ తర్వాత లాయర్ విషయమై మాట్లాడేందుకు ఎస్ఆర్ నగర్‌లోని ఎస్వీఆర్ లాడ్జికి జహంగీర్ ఆమెను పిలిపించాడు. అక్కడ ఆమెను కత్తితో బెదిరించి లైంగిక దాడికి (Rape Incident) పాల్పడ్డాడు. విషయం బయటకు లీకైతే ఆమె కుమారుడిని, భర్తను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ ఘటన తర్వాత కూడా జహంగీర్ ఆమెను లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువవడంతో బాధితురాలు తాజాగా బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు... కేసును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' కథ లీక్.. అసలు పాయింట్ చెప్పేసిన హీరోయిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి