Beating Retreat ceremony 2022 : దేశ రాజధాని ఢిల్లీలో బీటింగ్ రిట్రీట్ వేడుకకు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీంతో రాజ్‌పథ్‌తో పాటు రాష్ట్రపతి భవన్ త్రివర్ణ పతాకం, లేజర్ లైట్లతో దగదగా మెరిసిపోయింది. మువ్వన్నెల శోభను సంతరించుకున్నాయి.
ఏటా జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ (Beating Retreat) వేడుక ఈ సారి చాలా భిన్నంగా జరగనుంది. లేజర్ షో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో కూడిన డ్రోన్ షోలతో ఈ సారి బీటింగ్ ది రిట్రీట్ వేడుక జరగనుంది.
పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా, ఈ వేడుకను ఎంతో వైవిధ్యంగా నిర్వహించాలని భావిస్తోంది ఐఐటీ-ఢిల్లీకి చెందిన స్టార్టప్. దాదాపు 1,000 డ్రోన్‌లతో ఈ సారి ప్రదర్శన (Drone Show) ఉండనుంది.
నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ పారాపెట్‌పై.. దేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ లేజర్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఉండనుంది.
Delhi: A laser show would be held for the first time at the #BeatingRetreat ceremony. Rehearsals are being done for the ceremony, to be held at the Vijay Chowk on January 29th. pic.twitter.com/E8jm9Hui7Q
— ANI (@ANI) January 24, 2022
అలాగే ఈ వేడుకలో ప్రతి సంవత్సరంలాగానే.. ఫుట్‌టాపింగ్ మ్యూజిక్, క్లాసికల్ రెండిషన్‌లకు సంబంధించిన రెండు షోలు కూడా జరుగుతాయి. ఐఐటీ-ఢిల్లీకి చెందిన స్టార్టప్ బాట్‌లాబ్ దాదాపు 1,000 డ్రోన్‌లతో ఈ సారి డ్రోన్ షోను ఏర్పాటు చేయనుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు (75 years of independence) అయిన బ్యాక్‌డ్రాప్‌తో ఈ డ్రోన్ షో ఉంటుంది.
Also Read : Republic Day Parade: రిపబ్లిక్ డే పరేడ్ లో వాళ్లకు అనుమతి లేదు.. మార్గదర్శకాలు జారీ
కాగా ప్రపంచంలోనే ఇలాంటి డ్రోన్ ప్రదర్శనను నిర్వహిస్తున్న నాల్గవ దేశంగా భారతదేశం రికార్డ్ సృష్టించనుంది. గతంలో చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ (United States) ఇలాంటి డ్రోన్ ప్రదర్శనలను నిర్వహించాయి. ఇక బీటింగ్ ది రిట్రీట్ వేడుక (Beating the Retreat ceremony) శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయాలకు చిరునామాగా నిలుస్తుంది.
Also Read : Republic Day 2022: రిపబ్లిక్ డే సందర్భంగా నక్సల్స్, ఉగ్రవాదులు దాడులట, అక్కడ హైఅలెర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook