Ram Gopal Varma Tweets: పవన్‌ కల్యాణ్‌పై ఆర్జీవీ వరుస ట్వీట్స్‌.. అభిమానిగా డిమాండ్‌ చేశాడట!

Ram Gopal Varma Tweets on Bheemla Nayak: తెలుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని కథలతో తీసిన సినిమాలే పాన్‌ ఇండియా మూవీలుగా రిలీజ్‌ అవుతుంటే... భీమ్లా నాయక్ మూవీని ఎందుకు రిలీజ్ చేయకూడదంటూ ఆర్జీవీ ట్వీట్స్‌ యుద్ధం మొదలుపెట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 12:12 PM IST
  • పవన్‌కల్యాణ్‌పై డైరెక్టర్ ఆర్జీవీ వరుస ట్వీట్స్
  • భీమ్లా నాయక్ మూవీని ఉద్దేశించి పలు ట్వీట్స్‌
  • భీమ్లా నాయక్‌ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌ చేయాలని కోరిన ఆర్జీవీ
Ram Gopal Varma Tweets: పవన్‌ కల్యాణ్‌పై ఆర్జీవీ వరుస ట్వీట్స్‌.. అభిమానిగా డిమాండ్‌ చేశాడట!

RGV New Tweets: హీరో పవన్‌ కల్యాణ్‌పై డైరెక్టర్ ఆర్జీవీ వరుసగా ట్వీట్స్ చేశారు. పవన్‌ కల్యాణ్‌, రానా కాంబోలో వస్తోన్న "భీమ్లా నాయక్‌" (Bheemla Nayak) మూవీని ఉద్దేశించి పలు ట్వీట్స్‌ చేశాడు రాంగోపాల్ వర్మ. భీమ్లా నాయక్‌ సినిమాను పాన్‌ ఇండియా (Pan India Movie) లెవెల్‌లో రిలీజ్‌ చేయాలంటూ పవర్‌‌ స్టార్‌‌ను‌ కోరారు ఆర్జీవీ.

కొన్ని రోజుల క్రితం రిలీజైన పుష్ప మూవీ బాలీవుడ్‌లో భారీ వసూళ్లనే రాబట్టిందని, అక్కడ హిట్‌ అయ్యిందని.. కాబట్టి "భీమ్లా నాయక్‌" మూవీని కూడా పాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌ చేయాలంటూ కోరుతూ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) వరుసగా ట్వీట్స్‌ చేశారు.

ఇక పవన్‌ కల్యాణ్‌ "సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌" మూవీని బాలీవుడ్‌లో విడుదల చేయొద్దంటూ తాను చెప్పానని వర్మ గుర్తు చేశారు. హిందీలో ఈ మూవీ వర్క్‌అవుట్‌ కాదంటూ తాను అప్పట్లో ట్వీట్‌ చేశానంటూ వర్మ చెప్పుకొచ్చారు. కానీ తన మాట వినలేదని... దాని ఫలితం కూడా చూశారంటూ వర్మ (Varma) పేర్కొన్నారు. 

ఇక ఇప్పుడు కూడా తాను మళ్లీ చెబుతున్నాను అని వర్మ ట్వీట్‌లో ప్రస్తావించారు. "భీమ్లా నాయక్‌" సినిమాను పాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయండి అంటూ వర్మ ట్వీట్ చేశారు.

"పుష్ప" మూవీనే అంత వసూళ్లు రాబడితే.. భీమ్లా నాయక్‌ మూవీ ఏ స్థాయిలో కలెక్ట్‌ చేయాలంటూ వర్మ పేర్కొన్నారు. "భీమ్లా నాయక్‌" మూవీని పాన్‌ ఇండియా లెవెల్లో రిలీజ్‌ చేయకపోతే మీ ఫ్యాన్స్‌మైనా మేము.. వేరే హీరోల ఫ్యాన్స్‌కు సమాధానం చెప్పలేమంటూ చెప్పుకొచ్చారు ఆర్జీవీ. (RGV)

ఇక ఇటీవల తాను అల్లు అర్జున్‌ (Allu Arjun‌) గురించి చేసిన ట్వీట్స్ అన్నీ కూడా వోడ్కా టైమ్‌లో చేశానని.. కానీ.. ఇప్పుడు మాత్రం ఈ ట్వీట్స్‌ మొత్తం కూడా కాఫీ టైమ్‌లో పెడుతున్నానంటూ ఆర్జీవీ పేర్కొన్నారు. అంతేకాదు.. మీ తర్వాత సినీ ఇండస్ట్రీకి వచ్చిన తారక్, రామ్ చరణ్‌ కూడా పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోతుంటే మీరు మాత్రం ఇంకా టాలీవుడ్‌లోనే (Tollywood‌) సినిమాలు చేయడం తమకు బాధగా ఉందంటూ వర్మ ట్వీట్ చేశారు.

అలాగే కొమరం భీమ్‌, పుష్ప, అల్లూరి సీతారామరాజులాంటి స్టోరీసే పాన్‌ ఇండియా మూవీలు అయినప్పుడు భీమ్లా నాయక్ సినిమా పాన్‌ వరల్డ్‌ (Pan World) సబ్జెక్ట్‌ కాదంటారా అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. ఇలా చాలా వర్మ (Varma) పవర్‌‌ స్టార్‌‌ని ఉద్దేశించి చాలా ట్వీట్స్‌ పోస్ట్ చేశాడు.

Also Read: PMKMY pension scheme: సన్నకారు రైతులకు పీఎంకేఎంవై- నెలకు రూ.3000 పెన్షన్!

Also Read: IND vs WI: ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే! విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News