Lata Mangeshkar: లతా మంగేష్కర్ మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం

Lata Mangeshkar: గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2022, 11:51 AM IST
Lata Mangeshkar: లతా మంగేష్కర్ మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం

 Lata Mangeshkar passes away: లెజండరీ సింగర్, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్(92)‌ (Lata Mangeshkar) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విచారం వ్యక్తం చేశారు.అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. 

లతా దీదీ లేరంటే గుండె పగిలినట్లుంది: చిరంజీవి
నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా, గొప్ప లెజెండ్‌లలో ఒకరైన లతా దీదీ ఇక లేరంటే గుండె పగిలినట్లు ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

 

>> లతా మంగేష్కర్‌ మృతి పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు తన సానుభూతి ప్రకటించారు.

>>  ప్రపంచానికి తెలిసిన గొప్ప గాయకుల్లో లతా మంగేష్కర్ గారు ఒకరు. ఆమె మరణం నన్ను బాధకు గురిచేసింది.  ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

Also Read: Lata Mangeshkar passes away: లెజండరీ సింగర్ లతా మంగేష్కర్​ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News