Tiger Hunting underwater: నీటి అడుగున వేటాడే చిరుత పులిని చూశారా?

Tiger Hunting underwater: నేల మీద, చెట్లపై వేటాడే చిరుత పులిని చూసుంటారు. కానీ, నీటి అడుగున కూడా జంతువులను వేటాడే చిరుతను చూశారా?.. లేదంటే ఈ వీడియోను కచ్చితంగా చూడాల్సిందే. నీటి అడుగున చిరుత వేటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 04:40 PM IST
    • నీటి అడుగున వేటాడే చిరుతను చూశారా?
    • లేదంటే ఈ వైరల్ వీడియో ఒకసారి చూడండి!
Tiger Hunting underwater: నీటి అడుగున వేటాడే చిరుత పులిని చూశారా?

Tiger Hunting Underwater: జంతువుల్లో కెల్లా చిరుత పులి వేగంగా పరుగెత్తుతుందని నానుడి. వేటాడడం చిరుతతో మరోకటి పోటీ కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వేటాడే సమయంలో పరుగెత్తడం సహా ఎగిరి దూకడం, చెట్లు ఎక్కడం కూడా దానికి బాగా తెలుసు. అయితే వేట కోసం అది నీటి లోపలికి వెళ్తుందని ఈ వీడియోను చూస్తేనే తెలిసింది. 

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో చిరుత నుంచి తప్పించుకునేందుకు అనేక జంతువులు నదులు, ప్రవాహాల్లోకి దూకుతుంటాయి. అయినా వెనక్కి తగ్గని చిరుత పులి.. నీటిలోనూ వేటాడేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. చిరుత పులి నీటిలోని జలచరాలను వేటాడి తింటుందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

నీటి అడుగున జలచరాలను చిరుత పులి వేటాడే వీడియోను అమేజింగ్ నేచర్ అనే ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చిరుత పులి ఏదో జలచరాన్ని తినేందుకు నీటి అడుగుకు వెళ్లింది. దాన్ని పట్టుకొని పులి తింటున్న క్రమంలో దాని చేయి నుంచి జారీ పోయింది. అయినా పట్టువిడువని చిరుత పులి మరోసారి నీటి అడుగుకు వెళ్లి వేటను సాధించింది. ఈ వీడియో ఇప్పుడు గూగుల్ ట్రెండ్ అవుతుంది.  

Also Read: Karishma Tanna Dance: సమంత సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన కొత్త పెళ్లి కూతురు, నటి కరిష్మా తన్నా

Also Read: Woman Taste Indian food: ఈ మాడ్రిడ్‌ అమ్మాయికి ఇండియా ఫుడ్‌ తెగ నచ్చేసింది, అబ్బా ఏమన్నా టేస్టా అంటోన్న యువతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News