IPL 2022 Mega Auction: ఈ నెల 12 నుంచి టాటా ఐపీఎల్ మెగా వేలం! వరల్డ్‌ కప్‌ గెలిచినా అనర్హులే!

TATA IPL 2022 Mega Auction: టాటా ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఈ మెగా వేలంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టే క్రికెటర్స్‌ ఎవరో అతి తర్వలోనే తెలియనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం బెంగళూరులో వేదికగా ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 02:13 AM IST
  • మరి కొన్ని రోజుల్లోనే ఐపీఎల్‌ 2022 మెగా వేలం
  • ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ వేలం
  • బెంగళూరులో ఉండనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం
  • 590 మంది ప్లేయర్స్ పోటీ
IPL 2022 Mega Auction: ఈ నెల 12 నుంచి టాటా ఐపీఎల్ మెగా వేలం! వరల్డ్‌ కప్‌ గెలిచినా అనర్హులే!

TATA IPL 2022 Auction: క్రికెట్‌ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నటువంటి ఐపీఎల్‌ 2022 మెగా వేలం మరి కొన్ని రోజుల్లోనే జరగనుంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ వేలం ఉండనుంది. ఈ విషయాన్ని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వాహకులు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఉదయం 11 గంటల నుంచే వేలం పాట ప్రారంభంకానుంది.

స్టార్‌ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీ ప్లస్‌లో ఐపీఎల్‌ 2022 మెగా వేలం లైవ్ టెలికాస్ట్‌ కానుంది. అయితే ఐపీఎల్‌తో వీవో సంస్థం ఒప్పందం ముగియడంతో ఈసారి టాటా గ్రూప్‌ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. టాటా ఐపీఎల్‌ మెగా వేలంలో పార్టిటిసిపేట్‌ చేసేందుకు 590 మంది క్రికెటర్స్‌ పోటీ పడుతున్నారు. ఇందులో 228 మంది ఇంటర్నేషనల్‌ ప్లేయర్స్‌ ఉండగా, 355 మంది అన్‌ క్యాప్డ్‌ క్రికెటర్స్ ఉన్నారు. మరో 7 మంది అసోసియేట్‌ కంట్రీస్‌ క్రికెటర్స్ ఉన్నారు. 

కాగా, ఈ సారి ఐపీఎల్‌లోకి రెండు కొత్త టీమ్స్‌ చేరాయి. లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. లక్నో ఇప్పటికే టీమ్‌ పేరు, లోగోను ఆవిష్కరించింది. ఇక సీవీసీ క్యాపిటల్ తాజాగా టీమ్‌ పేరును అహ్మదాబాద్‌ టైటాన్స్‌ అని ప్రకటించింది. అలా టాటా ఐపీఎల్‌లో ఈ సారి అహ్మదాబాద్‌ టైటాన్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్స్‌ కొత్తగా చేరిపోయాయి.

ఇక ఐపీఎల్‌కు ఆడాలనే డ్రీమ్‌తో ఉన్న అండర్‌ 19 వరల్డ్ కప్‌ సాధించిన టీమిండియాలోని (Team India) ఎనిమిది మంది ప్లేయర్స్‌ ఐపీఎల్‌ (IPL) మెగా వేలానికి దూరం అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఏజ్‌, పలు కారణాల వల్ల వీరంతా ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. అండర్ 19 టీమిండియా జట్టు నుంచి కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఒక్కడు వేలంలో కనపడే అవకాశాలున్నాయి. మిగతా వారికి 19 సంవత్సరాలు నిండకపోవడం, వారిలో ఎవరూ కూడా దేశవాలీ క్రికెట్‌ ఆడకపోవడంతో వారికి అర్హత లేదు. అయితే ఈ విషయంపై త్వరలోనే బీసీసీఐ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Also Read: Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు.. రూ.16,500లకే 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ!

Also Read: Romeo Juliet Full Song: వాలెంటైన్స్ కోసం మరో కొత్త పాట.. రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter 

 

Trending News