Ministry Of Affairs: ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశం అజెండాను ఇవాళ ఉదయం ప్రకటించారు. ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా (AP Special Status) అంశాన్ని తొలగిస్తూ.. మరో సర్య్కూలర్ జారీ చేసింది కేంద్ర హోంశాఖ.
ఈ నెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ (Ministry Of Affairs) నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, ఏపీ (Andhra Pradesh) నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. ఈమేరకు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ సమాచారం అందించింది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు సమాచారం.
అజెండాలోని ప్రధానాంశాలు ఇవే:
* ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
* APSCSCL, TSCSCL సంస్థలో నగదు అంశం
* టీఎస్ డిస్కం ద్వారా ఏపీ జెన్కోకు విద్యుత్ బకాయిల చెల్లింపు
* పన్ను అంశాల్లో సవరణలు
* నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన
* 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం
Also Read: Andhra Pradesh: 'మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలు': కేంద్రమంత్రి అథవాలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook