EPF Balance: యూఏఎన్​ నంబర్ లేకుండా ఈపీఎఫ్ బ్యాలెన్స్​ తెలుసుకోవడం ఎలా?

EPF Balance: ఉద్యోగం చేసే వాళ్లలో ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే ఇందులో ఎంత మొత్తం జమ అయ్యింది? అందులో ఉద్యోగి వాటా ఎంత? సంస్థ వాటా ఎంత అనే విషయాలు ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 05:12 PM IST
  • ఈపీఎఫ్​ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?
  • యూఏఎన్​ నంబర్ లేకున్నా ఈపీఎఫ్ బ్యాలెన్స్​ తెలుసుకోవచ్చా?
  • పీఎఫ్​లో ఉద్యోగి వాటా, సంస్థ వాటాను తెలుసుకునే మార్గాలు
EPF Balance: యూఏఎన్​ నంబర్ లేకుండా ఈపీఎఫ్ బ్యాలెన్స్​ తెలుసుకోవడం ఎలా?

EPF Balance: సంగటిత రంగాల్లో పని చేసి ప్రతి ఉద్యోగికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక జీవనానికి అండగా ఉండటం కోసం ఈపీఎఫ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

ప్రతి నెల ఉద్యోగుల వేతనం నుంచి ఈపీఎఫ్​లో కొంత మొత్తం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ఉద్యోగి సంస్థ కూడా జమ చేస్తుంది. ఈ మొత్తానికి ప్రతి ఏటా వడ్డీ కూడా చెల్లిస్తుంది ప్రభుత్వం.

ఉద్యోగులు తమ ఈపీఎఫ్​ ఖాతాలో ఎంత డబ్బు ఉంది? అందులో తమ వాటా ఎంత? తమ సంస్థ ఎంత వాటా ఎంత? గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఎంత వచ్చింది అనే వివరాలు తెలుసునే వీలుంది.

ఇందుకోసం ఉద్యోగి సంస్థ ఏడది చివర్లో ఇచ్చే ఈపీఎఫ్​ స్టేట్​మెంట్​ కోసం వేచి చూడాల్సిన పని లేదు. సొంతంగానే ఈపీఎఫ్​ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ తెలుసుకునేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఎస్​ఎంఎస్​ ద్వారా, మిస్ట్​కాల్​ ద్వారా, ఈపీఎఫ్​ఓ పోర్టల్​ ద్వారా, ఉమాంగ్ యాప్​ ద్వారా సులభంగా ఈపీఎఫ్​ బ్యాలెన్స్ వివరాలను పొందొచ్చు.

యూఏఎన్​ నంబర్ లేకున్నా..

మీకు యూఏఎన్​ నంబర్ గుర్తు లేకున్నా.. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసకునే వీలుంది. ఇందుకోసం రెండు రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

మొదటిది మిస్డ్​ కాల్​...

ఈపీఎఫ్ వద్ద రిజిస్ట్రర్ అయిన మొబైల్ నంబర్ నుంచి 011-22901406 నంబర్​కు మిస్డ్​ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలను ఎస్​ఎంఎస్​ ద్వారా పొందొచ్చు. ఈ సదుపాయం ద్వారా ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందని మాత్రమ తెలుసుకునే వీలుంటుంది.

ఎస్​ఎంఎస్ పంపడం ద్వారా..

7738299899 అనే ఫోన్​ నంబర్​కు మీ రిజిస్టర్​ మొబైల్ నంబర్ ద్వారా EPFOHO UAN అనే మెసేజ్ పంపడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్​ను ఎస్​ఎంఎస్​ ద్వారా పొందొచ్చు.

ఈ పద్దతిలో మరో సదుపాయం కూడా ఉంది. అదేమిటంటే.. బ్యాలెన్స్ వివరాలను ఇంగ్లీష్​తో పాటు ఇతర భాషల్లోనూ పొందొచ్చు. ఉదాహరణకు తెలుగులో మీకు వివరాలు కావాలనుకుంటే.. EPFOHO UAN TEL అని టైప్​ చేసి 7738299899కి ఎస్​ఎంఎస్ పంపాలి. అలానే ఇతర ఏ భాష అయినా మొదటి మూడు అక్షరాలు టైప్​ చేసి ఎంఎంఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ వివరాలు సొంత బాషలో తెలుసుకునే వీలుంది.

అయితే పై రెండు పద్దతుల్లో ఈపీఎఫ్​ఓ బ్యాలెన్స్​ తెలుసుకునేందుకు ముందు ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగా మీ యూఏఎన్​ నంబర్​ను మీ సంస్థ యాక్టివేట్ చేసిందో లేదో తెలుసుకోవాలి. అప్పుడే ఈ సదుపాయాలు వాడుకోవచ్చు.

ఈపీఎఫ్​ఓ పోర్టల్​ ద్వారా..

ఈపీఎఫ్​ అధికారిక పోర్టల్​ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంది. ఇందుకోసం ముందుగా.. ఈపీఎప్​ పోర్టల్​ను  ఓపెన్ చేసి.. అందులో మెంబర్ పాస్​బుక్​లోకి లాగిన్ కావాలి.

ఇక్కడ మీ యూఏఎన్​ ఐడీ, పాస్​వర్డ్​ అడుగుతుంది. వాటిని ఎంటర్​ చేసి సెక్యూరిటీ క్వశ్చన్​కు అన్సర్ టైప్​ చేయాలి అప్పుడు లాగిన్​ అవ్వొచ్చు.

ఇక్కడ మీ బ్యాలెన్స్ వివరాలు సమగ్రంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్​ ఖాతా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మొత్తం జమ అయ్యింది? అందులో మీ వాటా ఎంత? మీ సంస్థ వాటా ఎంత అనే వివరాలతో పాటు.. ఆర్థిక సంవత్సరాల వారీగా వచ్చిన వడ్డీ వివరాలు ఉంటాయి.

ఉమాంగ్ యాప్​ ద్వారా..

ఉమాంగ్​ యాప్​లో మీ యూఏఎన్​ ద్వారా రిజిస్ట్రర్​ చేసుకోవడం ద్వారా.. పాస్​బుక్​లోకి సులభంగా లాగిన్ కావచ్చు. ఇందులో కూడా సమగ్రంగా మీ ఖాతా వివరాలను చూడొచ్చు. అంతే కాకుండా అత్యవసరాలకు ఇక్కడి నుంచే నేరుగా ఈపీఎఫ్​లో మీ వాటాలో కొంత మొత్తాన్ని విత్​డ్రా చేసుకునే వీలు కూడా ఉంది.

Also read: RBI Jobs: ఆర్​బీఐలో భారీగా ఉద్యోగాలు- దరఖాస్తు, పరీక్ష తేదీలు ఇవే..!

Also read: Flipkart Quick Delivery: ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్‌.. ఇక 45 నిమిషాల్లోనే గ్రాసరీ డోర్ డెలివరీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News