/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి.. ఈ రెండు పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్ జింక్ వంటి పోషకాలు ఉంటాయి. అదే విధంగా.. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరెంతో మేలు చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో బెల్లం, నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

బెల్లం, నెయ్యి ప్రయోజనాలు

1) కడుపులోని అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో నెయ్యి, బెల్లం ప్రముఖ పాత్ర వహిస్తాయి. నెయ్యి, బెల్లం కలిపి తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. అదే విధంగా కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు.

2) శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, వ్యక్తికి రక్తహీనత ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లం, నెయ్యి కలిపి తింటే రక్తహీనత నుంచి విముక్తి పొందుతారు.

3) బెల్లం, నెయ్యి కలిపి తింటే ఎముకలు దృఢంగా మారుతాయి. గోధుమలలో కాల్షియం ఉంటుంది. అదే నెయ్యిలో విటమిన్ కె2 లభిస్తుంది. అలాంటప్పుడు ఈ రెండింటిని ఎక్కువగా తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

4) చలికాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధపడుతుంటారు. ఇలాంటి నొప్పులతో బాధపడేవారు నెయ్యి, తమలపాకు మిశ్రమంతో పాటు కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు త్వరగా దూరమవుతాయి.

5) నెయ్యి, బెల్లంతో కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచూ మీరు తలనొప్పితో బాధపడుతుంటే.. జామ ఆకును తీసుకొని, దాన్ని కొద్దిగా నెయ్యితో కలిపి తింటే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. మైగ్రేన్ వంటి సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారం కొందరు నిపుణులు చెప్పిన సూచనలు మేరకు అందించబడింది. వాటిని పాటించే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)   

Also Read: Egg Side Effects: ఉడికించిన కోడిగుడ్డు తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో తెలుసా?

Also Read: Betel Leaf Benefits: శోభనం గదిలో పురుషులు తమలపాకులు (పాన్) ఎందుకు తింటారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Jaggery Ghee Benefits: Health benefits of Jaggery and Ghee
News Source: 
Home Title: 

Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!

Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!
Caption: 
Jaggery Ghee Benefits: Health benefits of Jaggery and Ghee | Zee Media
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • బెల్లం, నెయ్యి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
  • మలబద్ధకం, కీళ్ల నొప్పులకు మంచి ఔషధం
  • మైగ్రేన్ తలనొప్పి తగ్గే అవకాశం
     
Mobile Title: 
Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే ఈ రోగాలు మీ దరిచేరవు!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, February 21, 2022 - 14:04
Request Count: 
105
Is Breaking News: 
No