Russia Ukraine War: రష్యా సిబ్బంది హింసాత్మక చర్య.. సామాన్యుడి కారుపైకి ట్యాంక్ ఎక్కించి మరీ.. (వీడియో)

Russian Military tank crush Ukraine civilian car: రష్యా మిలటరీ సైన్యాలు ఏమాత్రం దయలేకుండా ఉక్రెయిన్‌పై ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ సాయుధ వాహనం కావాలనే రోడ్డుపై వెళుతున్న కారుపైకి దూసుకెళ్లింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 03:12 PM IST
  • ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం
  • ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు
  • సామాన్యుడి కారుపైకి ట్యాంక్ ఎక్కించి మరీ
Russia Ukraine War: రష్యా సిబ్బంది హింసాత్మక చర్య.. సామాన్యుడి కారుపైకి ట్యాంక్ ఎక్కించి మరీ.. (వీడియో)

Russian tank purposely swerves into car to crush Ukraine civilian: ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రష్యా మొదలు పెట్టిన మిలటరీ చర్యతో ఉక్రెయిన్‌ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. మరెందరో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. రష్యా మిలటరీ సైన్యాలు ఏమాత్రం దయలేకుండా ఉక్రెయిన్‌పై ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ సాయుధ వాహనం కావాలనే రోడ్డుపై వెళుతున్న ఓ కారుపైకి దూసుకెళ్లింది. 

రష్యా సైనిక సిబ్బంది చేస్తున్న హింసాత్మక చర్యకు సంబందించిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యా సైనిక ట్యాంక్ ఉక్రేనియన్ హైవే పై వెళుతుండగా.. ఎదురుగా ఓ ఉక్రేనియన్ పౌరుడు కారును నడుపుకుంటూ వస్తున్నాడు. ఇది చూసిన రష్యా సైనికుడు.. కావాలనే ఉక్రేనియన్ పౌరుడు నడుపుతున్న కారుపైకి దూసుకెళ్లాడు. కారుపైకి ఎక్కిన ట్యాంక్‌ను రష్యా సైనికుడు ముందుకు వెనుకకు నడిపాడు. దాంతో కారు డ్రైవర్ సీటులో ఉన్న ఉక్రేనియన్ పౌరుడు భయంతో కేకల వేశాడు. 

ఇది గమనించిన కొందరు అక్కడికి వచ్చి కారులో చిక్కుపోయిన ఉక్రేనియన్ పౌరుడుని బయటికి తీశారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు అయిన అతని ప్రస్తుత పరిస్థితి తెలియ రాలేదు. ఈ ఘటన ఉక్రేనియన్ రాజధాని కీవ్‌లో జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లతో కూడిన స్ట్రెలా-10 అనే సాయుధ వాహనంను రష్యా ఉపయోగించిందట. ఈ వాహనాని ఉక్రెయిన్, రష్యా సైనికులు వాడుతారని సమాచారం. 

కైవ్ నివాసి విక్టర్ బెర్బాష్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. రష్యా సైనిక ట్యాంక్ ఉద్దేశపూర్వకంగానే కారు మీదకు దూసుకెళ్లిందని తెలిపారు. 'ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. కేవలం వినోదం కోసమే కారుపైకి ఎక్కించారు. ఇలా చేయనవసరం లేదు. కారుపైకి ఎక్కించాక కూడా ముందుకు వెనక్కి నడుపుతూ అతడికి నరకం చూపించాడు' అని విక్టర్ పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అందరూ రష్యా సైనిక సిబ్బందిపై మండిపడుతున్నారు. 

Also Read: IND Vs SL: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 మ్యాచ్‌ అనుమానమే!!

Also Read: DJ Tillu OTT: ఓటీటీలోకి 'డీజే టిల్లు'.. త్వరలోనే టిల్లుగాడి లొల్లి షురూ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News