AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏపీ అసంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ బిల్లుతో పాటు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తేదీ ఖరారైంది. మార్చ్ 7 నుంచి బడ్దెట్ సమావేశాలు ప్రారంభమై మూడు వారాలపాటు కొనసాగనున్నాయి. మార్చ్ 7వ తేదీన ఉభయసభల్ని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చ్ 8వ తేదీన మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలుపనుంది. అనంతరం అంటే మార్చ్ 11వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల పూర్తి షెడ్యూల్ ఈ సమావేశంలో ఖరారు కానుంది.
మార్చ్ 9, 10 తేదీల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలుపనున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల 30 వేల కోట్లతో ఉండవచ్చని తెలుస్తోంది. వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఉండవచ్చని సమాచారం. అదే సమయంలో ఏపీ కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఏపీ మూడు రాజధానుల విషయంలో కొత్త బిల్లు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. అదే జరిగితే టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరేంటనేది అంతుబట్టడంలేదు. ఎందుకంటే గత అసెంబ్లీ సమయంలో ముఖ్యమంత్రి అయ్యేవరకూ సభలో అడుగుపెట్టనని శపథం చేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త జిల్లాల బిల్లులతో పాటు కీలకమైన బిల్లులు చంద్రబాబు లేకుండానే సభలో ప్రవేశపెట్టడమనేది ఆసక్తిగా మారింది.
చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆయనకే వర్తిస్తుందా లేదా తెలుగుదేశం పార్టీ మొత్తం అదే అభిప్రాయంతో ఉంటుందా అనేది చూడాలి. చంద్రబాబుతో పాటు తాము కూడా సమావేశాలకు దూరంగా ఉంటామనేది టీడీపీ ఎమ్మెల్యేల మాట. అంటే ఈసారి కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు అండ్ కో లేకుండానే ప్రాధాన్యత కలిగిన బిల్లులు రానున్నాయి.
Also read: Yadlapati Venkatarao Passed away: విషాదం.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook