Tdp Senior Leader Yadlapati Venkata Rao Passed away: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) (Yadlapati Venkatarao) ఇవాళ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లాలో జన్మించారు యడ్లపాటి. 1967,1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున.. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వేమూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్యకాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా, ప్రణాళికా-న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1983లో తెలుగుదేశం పార్టీలో (TDP) చేరారు.అనంతరం ఆయన 1995లో జడ్పీ చైర్మన్ గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
సంగం డెయిరీకి వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపాటి వెంకట్రావు. రైతు నాయకుడిగానూ యడ్లపాటి సేవలందించారు. 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. యడ్లపాటి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook