AP Inter exams 2022: పాత పద్దతిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్.. ప్రభుత్వ నోటిఫికేషన్ కొట్టేసిన హై కోర్టు

జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగాలన్న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టేస్తూ.. ఏపీ హై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 01:01 PM IST
  • ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హై కోర్టు
  • ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసిన హై కోర్టు
  • పాత పద్దతిలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఆదేశం
AP Inter exams 2022: పాత పద్దతిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్.. ప్రభుత్వ నోటిఫికేషన్ కొట్టేసిన హై కోర్టు

AP Inter exams 2022: మార్చి 11 నుండి ఆంధ్రప్రదేశ్ 2021-22 ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్స్ జరగనున్న సంగతి అందరికి తెలిసిందే! అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని నోటిఫికేజేషన్ విడుదల చేసిన సంగతి కూడా తేలింది!

ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీ ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కొంత మంది ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానాన్ని విచారించిన హై కోర్టు ఈ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది.  

ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసిన ఉన్నత న్యాయస్థానం పాత పద్దతిలోనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకే కాలేజీ విద్యార్థులు వేరు వేరు కాలేజీలలో ప్రాక్టికల్స్ హాజరు అవకుండా ఎప్పటి లాగే వారి వారి కాలేజీలలో ప్రాక్టికల్స్ హాజరు కావాలని హై కోర్టు నిర్ణయించింది. 

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ మార్చి 11 నుండి ప్రారంభమై 31 వరకు జరగనుండగా.. మొదటి మరియు రెండవ సంవత్సరపు రాతపూర్వక పరీక్షలు ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై మే 12 వరకు జరగనున్నాయి. కాగా వీటికి సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికీ జారీ చేయబడ్డాయి. 

నిజానికి ఏప్రిల్ 7 వ తేదీన ప్రారంభం కావాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు జేఈఈ మెయిన్స్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. హై కోర్టు ఆదేశించిన విధంగా పాత పద్దతిలో మొదట ప్రాక్టికల్స్ పరీక్షలు ముగిసిన తరువాత రాతపూర్వక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులు యధావిధిగా రూల్ నంబర్ తో పాటుగా, ఆధార్ కార్డు తో కూడా వారి వారి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు

Also Read: NZW vs INDW: చెలరేగిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌లు.. భారత్‌ లక్ష్యం 261!!

Also Read: Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook      

Trending News