Adivasi Wedding: ఈరోజుల్లో పెళ్లిళ్లంటే అల్లుళ్లకు కట్నం కింద బైకులు, కార్లు, బంగారం, ప్లాట్లు.. ఇలా కోరినవి, కోరనవి తమ స్తోమతను బట్టి ఇస్తున్నారు. ఇందుకు భిన్నంగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఓ మామ తన అల్లుడికి కట్నం కింద రెండు ఎద్దులు, ఎడ్లబండి కట్న కానుకలుగా ఇచ్చారు. దీనిపై పలువురి నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే... ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామానికి చెందిన పెందూర్ లచ్చు-పారుబాయిల కుమార్తె లింగుబాయిని అదే మండలంలోని చింతకర్ర గ్రామానికి చెందిన కుమ్ర జుగాదిరావ్కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కొమ్ము బూర, డోలు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహ సందర్భంగా అల్లుడైన కుమ్ర జుగాధిరావ్కు పెందూర్ లచ్చు రెండు జతల ఎడ్లు, ఓ ఎడ్లబండిని కట్నంగా ఇచ్చాడు.
ఎడ్లు, ఎడ్లబండిని అందంగా అలంకరించి పెళ్లి మంటపానికి తీసుకొచ్చాడు. అల్లుడికి వాటిని కట్నంగా అందజేశాక.. కొత్త జంటతో ఎద్దులకు పూజ చేయించారు. అనంతరం అదే ఎడ్లబండిలో నూతన వధూవరులను చింతకర్రలోని తన ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లాడు. ఇలా ఎడ్లబండిని కట్నంగా ఇవ్వడం పట్ల జుగాధిరావ్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బయటి ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ ఇప్పటికీ చాలామంది ఆదివాసీలు పెళ్లిళ్లలో కట్న కానుకలుగా ఎద్దులు, ఎడ్లబండిని ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా పాత సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఆదివాసీలు తమ సంస్కృతిని కాపాడుకోవడం హర్షనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీ సందడి షురూ.. సినిమాలోని విశేషాలు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook