China Coronavirus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎప్పుడు వీడుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు మరోసారి చైనాలో కోవిడ్ వైరస్ పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన అధికమౌతోంది.
కరోనా వైరస్..తన పుట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. ఇప్పటివరకు పలు దఫాలుగా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా..ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. ఐతే చైనాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు రెండింతలు పెరగడం కలవర పెడుతోంది. మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.
తాజాగా చైనాలో 3 వేల 400 కేసులు నమోదైయ్యాయి. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. రోజువారి కేసుల్లో ఇది రెండేళ్ల గరిష్ఠమని వారు తెలిపారు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. కీలక నగరం షాంఘైలో పాఠశాలలను మూసివేసింది. మరికొన్ని నగరాల్లో లాక్డౌన్ విధించింది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి పెరిగినట్లు తెలుస్తోంది. జిలిన్ ప్రాంతంలోనూ పాక్షిక లాక్డౌన్ ప్రకటించారు. ఉత్తర కొరియా సరిహద్దు అయిన యాంజిని పూర్తిగా దిగ్బంధంలో ఉంచారు. ఏడు లక్షల జనాభా ఉన్న యాంజినిలో..కరోనా పరీక్షలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆరు రౌండ్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఇటీవల మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని..అందుకే కేసుల సంఖ్య పెరుగుతోందని ఓ ఉన్నతాధికారి వివరించారు.
2019 డిసెంబర్లో తొలిసారి కోవిడ్ చైనాలోనే వెలుగుచూసింది. దీంతో జిన్‌పింగ్ ప్రభుత్వం వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంది. ఆంక్షలు, లాక్డౌన్లతో దేశంలో కొన్ని రోజులపాటు మూసివేశారు. కోవిడ్ జీరో లక్ష్యంగా కఠినమైన ఆంక్షలను తీసుకొచ్చారు. ప్రయాణాలను పూర్తిగా నిషేధించారు. భారీ స్థాయిలో కరోనా పరీక్షలు చేపట్టారు. మళ్లీ కేసులు పెరుగుతుండటంతో జిన్‌పింగ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Also read: Capital Punishment: సౌదీలో సంచలనం.. ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook