Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజధాని నగరం కీవ్ బాంబులతో మోతతో తల్లడిల్లుతోంది. బాంబుల దాడదుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం ఖాళీ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాత్కాలికంగా ఉక్రెయిన్‌కు సంబంధించిన భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌కు తరలించినట్లు వెల్లడిచింది. రోజు రోజుకు ఆందోళనలు పెరిగి పోతున్ననేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వివరించింది.
'ఉక్రెయిన్‌లో వేగంగా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు దృష్ట్యా ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంకంగా పోలాండ్‌కు తరలించాం. తదుపరి పరిణామాలను బట్టి పరిస్థితి అంచనా వేస్తాం.' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
In view of rapidly deteriorating security situation in Ukraine,including attacks in western parts of the country, it has been decided that the Indian Embassy in Ukraine will be temporarily relocated in Poland. The situation will be reassessed in light of further developments: MEA pic.twitter.com/4u3WcsM6jJ
— ANI (@ANI) March 13, 2022
ఇవాళ ఉదయమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన.. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సమీక్ష జరిగినట్లు ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి. ఇందులో ఉక్రెయిన్లోలో చిక్కుకున్న భారతీయులకు సంబంధించి, ఆపరేషన్ గంగాపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని.
Also read: Capital Punishment: సౌదీలో సంచలనం.. ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష
Also read: China Coronavirus: చైనాలో మళ్లీ అలజడి, చైనాలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook