Kishan reddy on TS Govt: ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య కొనసాగుతున్న వివాదంపై.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ప్రతి గింజను కేంద్రం కచ్చితంగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో త్వరలో నిర్వహించనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల గురించి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే?
తెలంగాణలో ఒప్పందం ప్రకారం చివరి గింజ వరకు కొంటామని చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి. పక్క రాష్ట్రాలైన ఆంధ్రా, తమిళనాడుకు లేని ఇబ్బంది తెలంగాణలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ మంత్రులు ప్రధానిపై, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేసందా లేదా అనే విషయంపై సీఎం కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. హజురాబాద్ ఎన్నికల తర్వాత ఓటమితో కుంగిపోవడం కారణంగానే.. బీజేపీని అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. విమర్శించేందుకు నోరెలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Live: Press Conference, New Delhi. https://t.co/3zciIQMxMb
— G Kishan Reddy (@kishanreddybjp) March 25, 2022
Also read: KCR Datti Controversy: దట్టి ధరించి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్.. పలువురు ఆగ్రహం
Also read: Viral Video: కూతురిని బ్యాండ్ బాజాతో స్కూలుకు సాగనంపిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook