Mahesh Babu: ఎలక్ట్రిక్​ కారు కొన్న మహేశ్​ బాబు.. స్వయంగా అందించిన ఆడి అధినేత

Mahesh Babu: తెలుగు స్టార్ హీరో మహేశ్​ బాబు కొత్త కారు కొనుగోలు చేశారు. తొలిసారి ఆయన ఎలక్ట్రిక్​ కారును కొన్నారు. ఈ విషయాన్ని ఆడి ఇండియా అధినేతతో పాటు, మహేశ్ బాబు ఇన్​స్టా ద్వారా వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 05:56 PM IST
  • విద్యుత్ కారు కొన్న మహేశ్ బాబు
  • ఆడి ఈ-ట్రోన్​నుతో ఫొటో షేర్​ చేసిన సూపర్​ స్టార్
  • మహేశ్​కు స్వయంగా అందించిన ఆడి ఇండియా అధినేత
Mahesh Babu: ఎలక్ట్రిక్​ కారు కొన్న మహేశ్​ బాబు.. స్వయంగా అందించిన ఆడి అధినేత

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్​ మహేశ్​ బాబు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశారు. జర్మనీకి చెందిన ప్రముక ఆటోమొబైల్ సంస్థ ఆడి సంస్థకు చెందిన ఈ-ట్రోన్​ను ఆయన కొన్నారు. నిజానికి ఈ కారు గత ఏడాది విడుదలైంది. కొన్నాళ్ల క్రితమే మహేశ్​ బాబు ఈ కారను బుక్ చేసుకున్నారు. కాగా ఏప్రిల్ 16న ఈ కారును డెలివరీ ఇచ్చింది సంస్థ. బ్లాక్​ కలర్ ఈ-ట్రోన్​ కార్​ను స్వయంగా ఆడి ఇండియా అధినేత బల్బీర్ సింగ్ దిల్లాన్​.. ఆడి ఈ-ట్రోన్​ను మహేశ్​ బాబుకు అందించారు.

ఆడి ఈ-ట్రోన్ కారు ముందు దిగిన ఫొటోను బల్బీర్​ సింగ్ దిల్లాన్​తో పాటు, మహేశ్​ బాబు కూడా ఇన్​స్టాలో షేర్ చేశారు.

క్లీన్​, గ్రీన్​, సుస్థిరమైన భవిష్యత్​ను ఇంటికి తీసుకువస్తున్నాం. ఆడి కార్​ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ మహేశ్​ బాబు పేర్కొన్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఆడి ఈ-ట్రోన్​ గురించి..

ఈ-ట్రోన్‌ ఎక్స్‌షోరూం (ఢిల్లీ) ధరను రూ 1.01 కోట్ల నుంచి 1.19 కోట్లుగా నిర్ణయించింది ఆడి.

 ఈ-ట్రోన్‌ కారు బ్యాటరీ సామర్థ్యం 71.2 కిలోవాట్స్‌ బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చింది. ఇది 230 కిలోవాట్స్​ ఔట్​పుట్​ను ఈ కారు విడుదల చేయగలదు. 540 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేసే సామర్థ్యం ఈ కారు సొంతం.

ఇక ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 190 కిలోమీటర్లు కాగా.. కేవలం 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం దీని సొంతం.

Also read: Flipkart Smart TV Offers: రూ.41 వేల విలువైన 50 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.9 వేలకే కొనొచ్చు!

Also read: Jio 4G Smartphone: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం.. ఉచితంగా Jio 4G స్మార్ట్ ఫోన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News