Delhi Violence: దేశ రాజధానిలో మరోసారి హింస, హనుమాన్ జయంతి ర్యాలీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Delhi Violence: ఢిల్లీలో జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో హింస చెలరేగింది. కొంతమంది పోలీసులకు గాయాలు కాగా, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2022, 07:59 AM IST
  • ఢిల్లీ జహంగీర్ పూరి ప్రాంతంలో హింస
  • హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్ణణ
  • ప్రజలు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తి
 Delhi Violence: దేశ రాజధానిలో మరోసారి హింస, హనుమాన్ జయంతి ర్యాలీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

elhi Violence: ఢిల్లీలో జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో హింస చెలరేగింది. కొంతమంది పోలీసులకు గాయాలు కాగా, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు., 

ప్రశాంతమైన దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక్కసారిగా హింస చెలరేగింది. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అల్లర్లు జరిగాయి. ఢిల్లీ జహంగీర్ పూరి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.

ఒక్కసారిగా హింస చెలరేగడంతో ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జహంగీర్ పూరి ప్రాంతంలో భారీగా పోలీసుల్ని మొహరించారు. రెండు వర్గాల మధ్య హింస చెలరేగిందని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని..అవసరమైన పోలీసుల బలగాల్ని మొహరించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయమై ఢిల్లీ పోలీసులతో మాట్లాడారు. హింసను అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ రాజధానిలో శాంతి భద్రతలు కాపాడటం కేంద్ర బాధ్యతని చెప్పారు. ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

అదే సమయంలో బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఆ ప్రాంతమంతా బంగ్లాదేశ్ చొరబాటుదారులతో నిండిపోయుందని చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు..దేశ పౌరులపై దాడి చేసే స్థాయికి చేరుకున్నారని..ఒక్కొక్కరి ధృవపత్రాలు తనిఖీ చేసి..చొరబాటుదారుల్ని దేశం నుంచి పంపించేయాలని ట్వీట్ చేశారు. ఈ దాడి ఒక ఉగ్ర చర్యగా ఆయన అభివర్ణించారు. 

Also read: Shocking News: పగబట్టిన నాగుపాము.. ఒకే వ్యక్తిని 7 సార్లు కాటేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News