RamVsYash: ట్విట్టర్‌లో 'గడ్డం' గొడవ... రాంచరణ్, యశ్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్...

#RamVsYash Fan War: ఎవరు మొదలుపెట్టారో.. ఎందుకు మొదలైందో తెలియదు కానీ... ట్విట్టర్‌లో రాంచరణ్, యశ్ ఫ్యాన్స్ 'గడ్డం' లుక్ విషయంలో గొడవ పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2022, 04:59 PM IST
  • ట్విట్టర్‌లో కొట్టుకుంటున్న రాంచరణ్, యశ్ ఫ్యాన్స్
  • మా హీరో గడ్డమే బాగుందంటూ గొడవ
  • పెయిడ్ ట్రెండ్ అంటున్న నెటిజన్లు
RamVsYash: ట్విట్టర్‌లో 'గడ్డం' గొడవ... రాంచరణ్, యశ్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్...

#RamVsYash Fan War: మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ జరగడం కామన్. మా హీరోను మించినోడు లేడు... మా హీరో రికార్డులు బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు... ఇలా ఇతర హీరోల అభిమానులతో కొంతమంది ఫ్యాన్స్ కయ్యానికి కాలు దువ్వుతుంటారు. తాజాగా ట్విట్టర్‌ వేదికగా రాంచరణ్-యశ్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. అయితే ఇది హీరోల స్టార్ స్టేటస్ గురించో... లేక రికార్డుల గురించో కాదు... గడ్డం గురించి. రాంచరణ్-యశ్.. ఈ ఇద్దరిలో ఎవరి గడ్డం బాగుందంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. దీంతో #RamVsYash హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

రాంచరణ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో గడ్డంతో కనిపించగా... యశ్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాల్లో గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. రాంచరణ్ ఫ్యాన్స్ తమ హీరో గడ్డమే బాగుందని కామెంట్స్ చేస్తుండగా... యశ్ ఫ్యాన్స్ తమ హీరో గడ్డమే బాగుందని ట్వీట్స్ చేస్తున్నారు. రాంచరణ్ బ్యాక్ గ్రౌండ్‌తో ఎదిగొచ్చిన హీరో అని... కానీ యశ్ స్వయంకృషితో స్టార్ హీరో అయ్యాడని యశ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం... ఎందుకీ అనవసర గొడవ అని వారిస్తున్నారు. అసలు ఇది పెయిడ్ ట్విట్టర్ ట్రెండింగ్ అని.. కావాలనే ఉన్నట్టుండి ఈ హాష్ ట్యాగ్‌ను తెర పైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. 

అంతేకాదు, ఈ గొడవ వెనక అసలు కారణం జూ.ఎన్టీఆర్‌ను సైడ్ చేయడమేనని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతుండటం గమనార్హం. రాంచరణ్-యశ్‌ మధ్య పోలిక తీసుకురావడమంటే పరోక్షంగా ఎన్టీఆర్ బిగ్ స్టార్ రేసులో లేడని చెప్పడమేనని... ఎన్టీఆర్ కన్నా రాంచరణ్ పెద్ద స్టార్ అని చెప్పేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్, కేజీఎఫ్ సినిమాతో యశ్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 

Also Read: Prashant kishor: పీకేతో పరేషాన్.. రేవంత్ రెడ్డి శిబిరంలో టెన్షన్!

Flipkart TV Days: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం కన్నా తక్కువ ధరకే 5 స్మార్ట్ టీవీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News