Corona Guidelines Delhi: దేశంతో పాటు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని విడుదల చేసింది. కరోనా ఫోర్త్ వేవ్ లో భాగంగా ఢిల్లీలోని పాఠశాలల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు.
కరోనా మార్గదర్శకాల ఆధారంగా పాఠశాల లోపలికి వచ్చే ముందు థర్మల్ స్కానింగ్ నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఏదైనా కుటుంబంలో తల్లిదండ్రులకు కరోనా సోకితే.. వారి పిల్లలను పాఠశాలలకు పంపొద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా మధ్యాహ్న భోజన సమయంలో ఆహారాన్ని లేదా ఏదైన వస్తువులను పంచుకోవడం నిషేధించారు. స్కూల్ లో తప్పనిసరిగా క్వారంటైన్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
ఢిల్లీ వైద్యారోగ్య శాఖ నివేదిక ప్రకారం.. ఢిల్లీలో ఒకే రోజులో నిర్వహించిన 20,480 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 965 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు పాజిటివిటీ రేట్ 4.71 శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఓ వ్యక్తి మరణించినట్లు నివేదించారు.
Also Read: Bank Holidays in May 2022: మే నెలలో 13 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు!
Also Read: CHSL Notification 2022: ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Corona Guidelines Delhi: పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. రాష్ట్రంలోని పాఠశాలలకు కీలక ఆదేశాలు!