Eluru Garbage Tax: సాధారణంగా పన్ను కట్టకపోతే ఫైన్ వేస్తారు అధికారులు. కానీ, ఏలూరులో ఇంతవరకూ కనీ వినీ ఎరుగని సంఘటన చోటు చేసుకుంది. పన్ను కట్టలేదంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.
ఏలూరుకు చెందిన కొమరి లక్ష్మి అనే మహిళ ఈనెల చెత్తపన్ను కట్టలేదు. సచివాలయ ఉద్యోగిని ప్రత్యూష ఫీల్డ్ విజిట్‌లో భాగంగా విషయం తెలుసుకుంది. చెత్తపన్ను ఎందుకు కట్టలేదని అడిగింది. ఇవాళ డబ్బులు లేవని, రేపు కడతానని లక్ష్మి బదులిచ్చింది. ప్రతి నెలా 50 రూపాయలు చెల్లించేవారమని, ఈ మధ్య చెత్తపన్ను వంద రూపాయలకు పెరిగడంతో కట్టలేదని ప్రత్యూష దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటినుంచి ప్రతినెలా వంద రూపాయలు చెల్లించాలని ప్రత్యూష సూచించింది. ఇదే విషయంపై కాసేపు వాదోపవాదాలు జరిగాయి.
సీన్ కట్ చేస్తే.. ప్రత్యూష పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లక్ష్మిపై ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన బాధితురాలు బిత్తరపోయింది. ఇప్పటివరకు జీవితంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేదని, వంద రూపాయల చెత్తపన్ను కోసం పోలీసు కేసు పెట్టడం న్యాయమేనా? అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ఈ పరిణామంపై స్థానికుల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది.
Also Read: Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?
Also Read: Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు గమనిక.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Eluru Garbage Tax: ఏలూరులో వింత ఫిర్యాదు..చెత్తపన్ను కట్టలేదని పోలీస్ కేసు..!!
ఏలూరులో వింత ఫిర్యాదు
చెత్తపన్ను కట్టలేదని పోలీస్ కేసు
నిరసన వ్యక్త చేస్తున్న బాధితురాలు