Aeronautical University in Telangana: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బ్రిటన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలను ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. లండన్‌లో రెండో రోజు.. పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీతో పాటు ఆ కంపెనీకి చెందిన ముఖ్య ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్న ఆ కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై మంత్రి చర్చలు జరిపారు.
ఆ తర్వాత పియర్సన్ కంపెనీకి చెందిన పలువురు ప్రతినిధులతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల పురోగతి కోసం నైపుణ్య శిక్షణ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్రణాళికలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌తో కలిసి పని చేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది.
ప్రపంచ స్థాయిలో ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు..
మరోవైపు.. క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హాల్ఫార్డ్, పోల్లార్డ్లు కూడా కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏరోనాటికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారన్న ప్రతిపాదనలపై యూనివర్శిటీ బృందంతో కలిసి చర్చించారు. ఆ ప్రాజెక్టు పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు. ప్రపంచ స్థాయిలో ఏరోనాటికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, ఈ క్రమంలోనే తమ ప్రయత్నంలో కలిసి రావాలని మంత్రి కేటీఆర్ క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ బృందాన్ని కోరారు.
అదే విధంగా కేటీఆర్ రెండో రోజు పర్యటనలో హెచ్ఎస్బీసీ ప్రతినిధులు మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్ బర్న్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నామన్న కంపెనీ ప్రతినిధులు.. వీటికి సంబంధించి త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం అవుతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు (Minister KTR) హామీ ఇచ్చారు.
Also read : UK Pharmaceutical Firm: తెలంగాణలో మరో అంతర్జాతీయ ఫార్మా సంస్థ పెట్టుబడులు
Also read : KTR Meets Ranil Jayawardena: బ్రిటన్ ట్రేడ్ మినిస్టర్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.