Buggana on Yanamala: సీఎం జగన్.. దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. కొందరూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్.. దావోస్ పర్యటనపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల చేసిన ఆరోపణలను ఖండించారు. ఆయనకు వయసు మీద పడుతున్న కొద్దీ..కనీస సంస్కారం లేకుండా పోతోందని మండిపడ్డారు.
సుదీర్ఘ కాలం మంత్రులుగా పనిచేసిన వారికి విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే పనిగట్టుకుని సీఎం జగన్, ఆయన కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ, ఎల్లో మీడియా దిగజారి కథనాలు ప్రచురిస్తున్నాయని..దీనిని ప్రజలు నమ్మరని చెప్పారు. దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలను మభ్యపెటడం టీడీపీ ట్రేడ్ మార్క్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ పర్యటనలో రహస్యమేమి లేదని స్పష్టం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి దావోస్ వెళ్తారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందని చెప్పారు. ఎయిర్‌ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతోనే అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియ ఆలస్యమయ్యిందని తేల్చి చెప్పారు.
ఈ కారణంగా లండర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే సరికి మరింత ఆలస్యమయ్యిందన్నారు. లండన్‌లోనూ ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉందని..ఈలోగా జురెక్‌లో ల్యాండ్ అవడానికి ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 దాటిపోయిందన్నారు మంత్రి బుగ్గన. మళ్లీ ల్యాండింగ్ కోసం అధికారులు రిక్వెస్ట్ పెట్టారని గుర్తు చేశారు. ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు పాల్గొనారని స్పష్టం చేశారు.
రాత్రి పది తర్వాత జురెక్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా ఏళ్ల నుంచి నిషేధించారని..భారత రాయబార కార్యాలయ అధికారులకు స్విస్ అధికారులు తెలిపారని వెల్లడించారు. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు తెలియజేశారన్నారు. ఆ తర్వాత వారంతా సీఎం జగన్(CM JAGAN), అధికారులతో చర్చించి..లండన్‌లోనే బస ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ వక్రీకరించి..అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన ఫైర్ అయ్యారు.
Also read:Yanamala on CM Jagan:దోపిడీ సొమ్ము దాచుకునేందుకే విదేశీ టూర్..జగన్‌పై యనమల ఫైర్..!
Also read:Jr Ntr Help To Kalyanram: అన్న కళ్యాణ్ రామ్ కు జూనియర్ ఎన్టీఆర్ గిఫ్ట్! ఏం ఇచ్చారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook