Bihar Road accident news: బీహార్ పూర్నియాలో (Purnia) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నేషనల్ హైవే 57పై పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జలల్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీమ కాళి ఆలయం సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రక్కులో డ్రైవర్‌తో సహా 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.అంతేకాకుండా క్షతగాత్రులను జాలాల్గఢ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రక్కు బోల్తా పడిన వెంటనే కూలీలంతా ఇనుప నీటి పైపుల కింద కూరుకుపోయి మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కూలీలందరూ రాజస్థాన్ వాసులు. ట్రక్కు అగర్తల నుంచి జమ్మూకశ్మీర్‌కు వెళ్తోంది. డ్రైవర్ నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీను తెచ్చి టక్రును పైకి లేపారు. శిథిలాల కింద ఉన్న కూలీలను బయటకు తీస్తున్నారు. సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
Also Read: Viral Video: రైలెక్కిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు షాక్! వైరల్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Bihar accident: బీహార్‌లో ఘోర ప్రమాదం...ట్రక్కు బోల్తా పడి 8 మంది కూలీల దుర్మరణం!