Athmakur By Election 2022: ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ...

Athmakur By Election 2022: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. జూన్ 23న ఆత్మకూరు బైఎలక్షన్ జరగనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 12:51 AM IST
  • ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక
  • ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
  • జూన్ 23న ఉపఎన్నిక పోలింగ్
Athmakur By Election 2022: ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ...

Athmakur By Election 2022: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. జూన్ 23న ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దేశంలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ స్థానాలకు జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఉపఎన్నికలకు మే 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూన్ 6వ తేదీతో నామినేషన్లు ముగుస్తాయి. జూన్ 7న నామినేషన్ల పరిశీలన.. జూన్ 9 వరకు ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. జూన్ 23న పోలింగ్, జూన్ 26న ఫలితాలు వెలువడుతాయి.

ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి..? :

ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో విక్రమ్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి విక్రమ్ రెడ్డిని అన్నివిధాలా గైడ్ చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేనలు ఇక్కడ అభ్యర్థిని నిలబెడుతాయా లేదా చూడాలి. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉంది. మేకపాటి కుటుంబానికి బంధువైన బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి బీజేపీ తరుపున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఉపఎన్నికలు జరిగే స్థానాలు :

పంజాబ్‌లోని సంగ్రూర్, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాలతోపాటు త్రిపురలోని అగర్తలా, టౌన్ బోర్డోవలి, సుర్మా, జుబరాజ్‌నగర్, ఢిల్లీలోని రాజిందర్ నగర్, జార్ఖండ్‌లోని మందర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. 

Also Read: IPL Eliminator Match: లక్నోపై బెంగళూరు విక్టరీ... 14 పరుగుల తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్..  

Also Read: Somuveerraju Comments: ఏపీలో కోనసీమ ఘటనపై పొలిటికల్ వార్..సోమువీర్రాజు ఏమన్నారంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News