Pan India Stars List: ఓర్మాక్స్ మీడియా పాన్ ఇండియా స్టార్స్ జాబితా విడుదల, తొలిస్థానంలో విజయ్

Pan India Stars List: తమిళ సూపర్ స్టార్ నటుడు విజయ్ పాన్ ఇండియా నటుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రభాస్, అల్లు అర్జున్‌ను కూడా వెనక్కి నెట్టేశాడట. ఆ వివరాలు చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 28, 2022, 01:10 PM IST
Pan India Stars List: ఓర్మాక్స్ మీడియా పాన్ ఇండియా స్టార్స్ జాబితా విడుదల, తొలిస్థానంలో విజయ్

Pan India Stars List: తమిళ సూపర్ స్టార్ నటుడు విజయ్ పాన్ ఇండియా నటుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రభాస్, అల్లు అర్జున్‌ను కూడా వెనక్కి నెట్టేశాడట. ఆ వివరాలు చూద్దాం.

ఓర్మాక్స్ మీడియా సర్వే ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా అంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో అగ్ర నటీనటుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా పాన్ ఇండియా స్టార్ల జాబితా విడుదల చేసింది. ఇందులో ఆర్ఆర్ఆర్ , రాధేశ్యామ్ సినిమా నటులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతుందంటున్న ఆర్ఆర్ఆర్ సినిమా స్టార్లకు..ఓర్మాక్స్ నివేదికలో రెండవ స్థానం దక్కడం ఆశ్చర్యంగా ఉంది. బీస్ట్ సినిమా హీరో విజయ్ మొదటి స్థానంలో నిలిచాడు.

ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లు విజయ్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఓర్మాక్స్ నివేదిక ప్రతి నెలా వస్తుండటంతో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని రంగాలకు ఈ జాబితాపై ఆసక్తి నెలకొంటోది. పాన్ ఇండియా టాప్ 10 జాబితా ఇలా ఉంది..

1. విజయ్
2. జూనియర్ ఎన్టీఆర్
3. ప్రభాస్
4. అల్లు అర్జున్
5.అక్షయ్ కుమార్
6. అజిత్ కుమార్
7. యశ్
8. రామ్‌చరణ్
9.సూర్య
10. మహేశ్ బాబు

యాక్షన్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కిన బీస్ట్ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. 25 రోజుల విజయ్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా..ప్రభు, జయసుధ, శ్రీకాంత్, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్తలు కీలకపాత్రల్లో కన్పించనున్నారు. 

Also read: Balaiah Poster Release: బాలయ్య NBK107 పోస్టర్ విడుదల, రౌద్రరూపంలో బాలకృష్ణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News