Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ.. విద్యా కేంద్రం.. తెలంగాణ ఉద్యమ గడ్డ. లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతవ్యక్తులుగా తీర్చిదిద్దిన సరస్వతి క్షేత్రం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్శిటీ ఇప్పుడు అసాంఘిక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకుఅడ్డాగా మారిందినే ఆరోపణలు వస్తున్నాయి. క్యాంపస్ లో వరుసుగా వెలుగు చూస్తున్న ఘటనలతో విద్యార్థులు కలవరపడుతున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్శిటీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని ఓయూ పోలీసులు అప్పగించారు ఉప్పల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. యూనివర్శిటీ వెనుక భాగంలో కొన్ని రోజులుగా పేకాడ డెన్ నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం రావడంతో ఉప్పల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోనికి తీసుకుని స్థానిక యూనివర్శిటీ పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి లక్షా 20 వేల రూపాయలు, సెల్ ఫోన్లను ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ టీమ్ స్వాధీనం చేసుకుంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారమ జరుపుతున్నారు. క్యాంపస్ లో పేకాడ డెన్ ఎప్పటి నుంచి నడుస్తోంది.. ఎవరూ నడిపిస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్యాంపస్ లో ఇలాంటి డెన్ లు చాలా నడుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలనే ఉస్మానియా యూనివర్శిటీ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. క్యాంపస్ లోని హాస్టల్స్ పై ఎలాంటి నిఘా లేకపోవడంతో ఎవరూ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. యూనివర్శిటీలోకి బయటికి వ్యక్తులు విచ్చలవిడిగా వస్తున్నా అడ్డుకునే నాథుడే లేరు. ఇదే అదనుగా కొందరు క్యాంపస్ ను తమ అక్రమ దందాలకు కేంద్రంగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. పేకాట డెన్ నడిపిస్తున్నారనే వార్తలతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై క్యాంపస్ లో భద్రత పెంచాలని, నిఘా పెంచాలని కోరుతున్నారు.
READ ALSO:Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో మరో 25 మంది అరెస్ట్.. ఇంటర్నెట్ సేవలపై మరో వారం బ్యాన్
READ ALSO: Pawan Kalyan: ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్! చంద్రబాబు ఫ్యాన్స్ పరేషాన్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook