Nagababu Tour: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇప్పటివరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్..రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం అందజేశారు. రైతుల సమస్యలే అస్త్రంగా వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆ దిశగా ముందుకు వెళ్తోంది.
తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జిల్లాల టూర్ ఖరారు అయ్యింది. వచ్చే నెల ఒకటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా, జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారు. మూడురోజులపాటు సాగనున్న టూర్లో పార్టీ సీనియర్ నేతలు , కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.
పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం, పార్టీ భవిష్యత్ కార్యకలాపాలపై నేతలు, కార్యకర్తలకు నాగబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతంపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆసక్తి ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మరోవైపు నాగబాబు టూర్‌ను సక్సెస్ చేసేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక సీటును సాధించింది. జనసేన నుంచి గెలిచిన రాపాక పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీకి ఆయన మద్దతు తెలిపారు. 2024 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. ఐతే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన ముందుకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతోంది. ఐతే ఆ ప్రచారాన్ని జనసేన,బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్నేని అంటున్నారు.
Also read: Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వణుకు..తాజాగా ఆయా దేశాల్లో కొత్త కేసులు..!
Also read:GT vs RR Dream11 Team: ఐపీఎల్ 2022 ఫైనల్ పోరులో గుజరాత్, రాజస్తాన్ ఢీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook