Divyavani Resign: టీడీపీలో ఆ పార్టీ నేత, సినీ నటి దివ్య వాణి ఎపిసోడ్ ముగిసింది. గత మూడు రోజులుగా ఆమె రాజీనామా అంశంపై గందరగోళం నెలకొంది. తాజాగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఓ వీడియోను దివ్య వాణి విడుదల చేశారు. ఇంతవరకు తనను ఆదరించిన టీడీపీకి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా చంద్రబాబు భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను వివరించారు.
ఒంగోలులో మహానాడు ముగిసిన తర్వాత తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి, ఆ పార్టీ నేత దివ్య వాణి ప్రకటించారు. దీంతో ఆ పార్టీలో కలకలం రేగింది. మహానాడులో జరిగిన అవమానంతోనే రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఆమె రాజీనామా ఉపసంహరించుకున్నారు. కొందరు కావాలనే తనపై ప్రచారం చేస్తున్నారని ఈసందర్భంగా వివరించారు.
ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో దివ్య వాణి భేటీ అయ్యారు. రాజీనామా ఎపిసోడ్‌పై ఆయనకు వివరించారు. కొందరు కావాలనే తనపై ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని..దానిని చూసి రాజీనామా చేసినట్లు తెలిపారు. నిజం కాదని తెలిసి వెంటనే రాజీనామా పోస్టును డిలీజ్ చేశానని చంద్రబాబుకు దృష్టికి తీసుకెళ్లారు. ఐతే ఇప్పుడు మళ్లీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
దివ్యా వాణి ..త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీకి సినీ గ్లామర్ తీసుకొచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో సీఎం జగన్ సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరుతున్నట్లు గుస గుస వినిపిస్తున్నాయి. మరోవైపు దివ్య వాణి రాజీనామా అంశం అంతా డ్రామా అన్న విమర్శలు వస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇదంతా జరుగుతోందన్న వాదన ఉంది. త్వరలో ఈఎపిసోడ్పై క్లారిటీ రానుంది.
Also read:Bharatsinh Solanki Issue: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కాంగ్రెస్ నేతకు బడితపూజ..అసలేమి జరిగిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook