IND vs SA 1st T20I, Team India eye on new world record in T20 Cricket: స్వదేశంలో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. ఇరు జట్ల జట్ల మధ్య గురువారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. జూన్ 9 నుంచి 19 వరకు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం (జూన్ 9) తొలి మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ పడనుండగా.. మ్యాచ్ 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి టీమిండియాకు మంచి అవకాశం లభించింది.
రేపు దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టీ20లో భారత్ గెలుపొందితే.. ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. తొలి టీ20లో భారత్ గెలుపొందితే వరసగా ఎక్కువ (13) విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డుల్లోకి ఎక్కుతుంది. ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్లలో ఆఫ్ఘనిస్థాన్, రోమేనియా, భారత్ ఉన్నాయి. మూడు జట్లు వరుసగా 12 టీ20 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాయి. తొలి టీ20లో భారత్ విజయం సాధిస్తే.. వరుసగా 13 టీ20 మ్యాచులు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.
టీ20 ప్రపంచకప్ 2021లో చివరి మూడు మ్యాచులను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఆప్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలపై వరుసగా గెలిచిన భారత్.. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిల్యాండ్‌లతో జరిగిన టీ20 సిరీసులను 3-0తో కైవసం చేసుకుంది. మొత్తంగా భారత్ 12 వరుస మ్యాచులలో జయకేతనం ఎగురవేసింది. దాంతో భారత జట్టు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టీ20లో భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే ఈ రికార్డుపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. 'మేం రికార్డు గురించి అస్సలు ఆలోచించడం లేదు. వరుసగా మ్యాచ్‌లు గెలవడం మాత్రం ఆనందంగా ఉంది. రికార్డులు, ఘనతల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. మేం ఆడే ప్రతి మ్యాచ్ గెలవాలనుకుంటుంన్నాం. అందుకోసం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం. వ్యూహాలతో మైదానంలోకి దిగి వాటిని అమలుపరచాలి. పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికాతో మేం ఆడబోతున్నాం. ఈ సిరీస్ మాకు మంచి పరీక్ష. అంతర్జాతీయ క్రికెట్ ఆడని యువ క్రికెటర్లను పరీక్షించడానికి అవకాశం వచ్చింది' అని అన్నారు.
Also Read: America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత..ఆరుగురు మృతి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి