Astrology Tips to get Kuber Blessings: ఈరోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు. జీవితం సాఫీగా సాగాలంటే ఆర్థికంగా మెరుగ్గా ఉండాలి. కొంతమంది పగలు రాత్రి కష్టపడి చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇతరుల చేతుల్లోకి వెళ్తుంటుంది. లక్ష్మీ దేవి కటాక్షం ఉన్నప్పటికీ చిన్న చిన్న దోషాల కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నియమాలు సూచించబడ్డాయి. వాటిని పాటించినట్లయితే... మీ డబ్బు మీ వద్దే పదిలంగా ఉంటుంది. తద్వారా సంపద పెరిగి ఆర్థికంగా స్థితిమంతులవుతారు. ఇందుకోసం జ్యోతిష్య శాస్త్రం సూచిస్తున్న నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం...
ఇలా చేస్తే ధనం నిలిచి ఉంటుంది :
వాస్తుశాస్త్రం ప్రకారం సంపదకు లక్ష్మీ దేవి, కుబేరుడిని చిహ్నంగా భావిస్తారు. ఈ ఇద్దరి అనుగ్రహం పొందినట్లయితే సంపాదనతో పాటు సంపద పెరుగుతుంది. ధన నష్టానికి అడ్డుకట్ట పడుతుంది.
కుబేరుడి అనుగ్రహం కోసం ఇంటి దక్షిణం లేదా నైరుతి దిశలో ఉన్న గోడ వైపు అల్మారాను ఉంచండి. అందులో నగదు భద్రపరచండి. ఇలా చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది.
డబ్బును ఆకర్షించడానికి, ఖజానా ముందు అద్దం పెట్టాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి ఆదాయం రెట్టింపవుతుంది.
ఎవరి నుంచి ఎలాంటి సేవలు పొందినా.. వారికి కొంత డబ్బు చెల్లించాలి. మీరు కూడా ఉచితంగా సేవ చేయవద్దు. డబ్బు నిలిచి ఉండే మార్గాల్లో ఇదొకటి.
తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎల్లకాలం నిలిచి ఉండదని గుర్తించండి. సత్యంతో సంపాదించిన డబ్బు మాత్రమే నిలుస్తుంది.
ప్రతి నెలా మీ సంపాదనలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ, కుబేర అనుగ్రహంతో ధనప్రాప్తి లభిస్తుంది.
ఇంట్లోనైనా, బయటనైనా స్త్రీలను గౌరవించండి. స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. స్త్రీలను అగౌరవపరిస్తే లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Viral News: రూ.50 వేలు ఇస్తేనే కొడుకు శవం.. లంచం డబ్బుల కోసం వీధుల్లో ఆ పేద తల్లిదండ్రుల భిక్షాటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook