Congress Protest: కాంగ్రెస్ ఛలో రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం..నేతల అరెస్ట్

Congress Protest: హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన ఛలో రాజ్‌భవన్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎస్‌కు తరలించారు.  

Written by - Alla Swamy | Last Updated : Jun 16, 2022, 12:55 PM IST
  • ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత
  • రాజ్‌భవన్‌ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతల యత్నం
  • అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం
Congress Protest: కాంగ్రెస్ ఛలో రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం..నేతల అరెస్ట్

Congress Protest: హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన ఛలో రాజ్‌భవన్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బైక్‌లను తగలబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

రాజ్‌భవన్‌ వైపు వెళ్లకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని దాటుకుని రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్కతోపాటు ఇతర నేతలు రాజ్‌భవన్‌ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Also read: India vs South Africa: రేపే నాలుగో టీ20 మ్యాచ్‌..టీమిండియాకు భారీ షాక్..!

Also read: Srilankan Airlines: గగనతలంలో పైలట్ల అప్రమత్తత.. తప్పిన పెనుప్రమాదం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News