BCCI issue serious warning to Rohit Sharma and Virat Kohli: ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా యూకే వెళ్లిన విషయం తెలిసిందే. ఓ టెస్ట్, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం భారత ఆటగాళ్లు రెండు బృందాలుగా వెళ్లారు. లండన్‌లో విమానం దిగిన టీమిండియా ప్లేయర్స్ ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌లో టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే యూకే వెళ్లిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీరియస్ వార్నింగ్ ఇచ్చిందని సమాచారం తెలుస్తోంది.
ఇప్పటికే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా కారణంగా జట్టుతో పాటు వెళ్లలేకపోయాడు. ఇది చాలదన్నట్టు ఇటీవల లండన్‌లో ల్యాండైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాస్కులు లేకుండా షాపింగ్ అంటూ అక్కడి వీధుల్లో చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా అభిమానులతో ఫోటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఆటగాళ్లకు కరోనా సోకితే మరోసారి సిరీస్ ప్రమాదంలో పడుతుందని బీసీసీఐ ఈ ఇద్దరిపై గుర్రుగా ఉందట.
యూకేలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాస్కులు లేకుండా వీధుల్లో తిరగడంపై బీసీసీఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. వీరితో పాటు టీమిండియా మొత్తాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లందరూ కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందట. యూకేలో ఇంకా కరోనా పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికీ ప్రతి రోజూ 10 వేలపైగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు ఉన్నాయి.
Rohit Sharma and Virat Kohli with fans at UK. pic.twitter.com/IMqLRdqVsM
— Johns. (@CricCrazyJohns) June 20, 2022
Also Read: Tollywood: బ్రేకింగ్: తెలుగు సినిమా షూటింగ్ లు బంద్.. సమ్మెలోకి సినీ కార్మికులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook