ప్రముఖ వాగ్గేయకారుడు రజినీకాంతరావు మృతి

ఆకాశవాణిలో స్వరకర్తగా, గీత రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలి గాయకుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజినీకాంతరావు కన్నుమూశారు.

Last Updated : Apr 24, 2018, 04:05 PM IST
ప్రముఖ వాగ్గేయకారుడు రజినీకాంతరావు మృతి

ఆకాశవాణిలో స్వరకర్తగా, గీత రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలి గాయకుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజినీకాంతరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస వదిలారు.

1920 జనవరి 29 న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో రజనీకాంతరావు జన్మించారు. 1942 జూలైలో ఆకాశావాణి మద్రాస్‌ కేంద్రంలో కళాకారుడిగా రజనీకాంతరావు చేరారు. ఆకాశవాణిలో తొలి స్వరకర్తగా శ్రోతలను అలరించారు.  విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చిన వారిలో ఆయన కీలకమైన వారు. తొలితరం సంగీత దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ‘మాది స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’ అనే దేశభక్తి గేయాన్ని రచించి స్వరాలు సమకూర్చారు. ఆయన రచించిన వాగ్గేయకార చరిత్ర 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. పాషాకలం పేరుతో గేయ కవితలు కూడా రాశారు. పలు చలన చిత్రాలకు బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం కూడా అందించారు. కాగా, రజినీకాంతరావు మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థీవదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని అన్నారు. 

Trending News