Mohan Babu : సీఎం జగన్ కు మోహన్ బాబు బిగ్ షాక్.. ఎంత మాట అన్నారో తెలుసా?

Mohan Babu Hot Comments: మంచు మోహన్ బాబు.. తెలుగు రాష్ట్రాల్లో టాప్ హీరో. కలెక్షన్ కింగ్ గా అభిమానులు పిలుచుకునే మోహన్ బాబు.. సినిమాల్లోనూ కాదు రాజకీయాల్లోనూ తన దైన ముద్ర వేసుకున్నారు.సీఎం జగన్ తో విభేదాలు ఉన్నాయనే వాదనలు వస్తున్న వేళ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు

Written by - Srisailam | Last Updated : Jun 28, 2022, 07:52 PM IST
  • తిరుపతి కోర్టుకు హాజరైన మోహన్ బాబు
  • సీఎం జగన్ షాకిచ్చేలా మోహన్ బాబు కామెంట్స్
  • నేను బీజేపీ మనిషిని- మోహన్ బాబు
Mohan Babu : సీఎం జగన్ కు మోహన్ బాబు బిగ్ షాక్.. ఎంత మాట అన్నారో తెలుసా?

Mohan Babu Hot Comments: మంచు మోహన్ బాబు.. తెలుగు రాష్ట్రాల్లో టాప్ హీరో. కలెక్షన్ కింగ్ గా అభిమానులు పిలుచుకునే మోహన్ బాబు.. సినిమాల్లోనూ కాదు రాజకీయాల్లోనూ తన దైన ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. టీడీపీ నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబుతో మాత్రం మోహన్ బాబు సఖ్యత కుదరలేదు. వైఎస్సార్ కు దగ్గరయ్యారు. మంచు విష్ణు భార్య వైఎస్సార్ దగ్గరి బంధువు. వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉన్న మోహన్ బాబు.. వైఎస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఏపీలో ప్రచారం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా మోహన్ బాబుకు కీలక పదవి వస్తుందని అంతా భావించారు. కాని జగన్ ఏ పదవి ఇవ్వలేదు. దీంతో జగన్, మోహన్ బాబు మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో మోహన్ బాబు కూడా క్లారిటీ ఇవ్వలేదు.

సీఎం జగన్ తో విభేదాలు ఉన్నాయనే వాదనలు వస్తున్న వేళ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషినని చెప్పారు మోహన్ బాబు. కేంద్రంలో బీజేపీ  అధికారంలో ఉండాలని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలవాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకరిని అని అన్నారు. తాను రియల్‌ హీరోనని, విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని మోహన్‌బాబు కామెంట్ చేశారు. కేసు విచారణలో భాగంగా మోహన్ బాబుతో పాటు అతని కుమారులు మంచు విష్ణు, మనోజ్ మంగళవారం తిరుపతి కోర్టుకు వచ్చారు. తిరుపతిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌ పాదయాత్రగా కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్ కు టాటా చెప్పేసి మోహన్ బాబు ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందనే చర్చలు తెరపైకి వస్తున్నాయి. మోహన్ బాబుకు బీజేపీ పెద్దలతో మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లి  ప్రధాని మోడీని కలిశారు. కేంద్రంతో బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన మోహన్ బాబు... ఏపీలో మాత్రం జగన్ వెంటే ఉన్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలోనూ మోహన్ బాబు బీజేపీకి మద్దతు ఇస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.

మోహన్‌ బాబుతో పాటు విష్ణు, మనోజ్‌పై 2019 మార్చి 22న చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. విద్యార్థుల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న శ్రీ విద్యా నికేతన్‌ విద్యార్థులతో కలిసి మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌లు ఆ రోజు  రోడ్డుపై ధర్నా చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో మోహన్ బాబుపై కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ధర్నా చేశారంటూ చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు కోర్టుకు వచ్చారు. కేసు విచారణ సెప్టెంబర్ 20కి కేసు వాయిదా పడింది.

Read also: PV JAYANTHI: పీవీని కేసీఆర్ వాడుకుని వదిలేశారా! జయంతి వేడుకలకు ఎందుకు హాజరుకాలేదు?  

Read also: TS TET 2022: జూలై 1న తెలంగాణ టెట్ ఫలితాలు.. ఫైనల్ కీ పై క్లారిటీ ఇవ్వని సబితా ఇంద్రారెడ్డి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News