Covid 19 Updates: నిన్నటితో తగ్గిన కొవిడ్ తీవ్రత.. దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?

Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే కేసులు కాస్త తగ్గినా.. రోజువారి కేసులు 17వేలకు పైగానే నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 17 వేల 070 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Written by - Srisailam | Last Updated : Jul 1, 2022, 10:29 AM IST
  • నిన్నటి కంటే తగ్గిన కొవిడ్ కేసులు
  • గత 24 గంటల్లో 17, 070 కేసులు
  • లక్షా 7 వేలు దాటిన యాక్టివ్ కేసులు
Covid 19 Updates: నిన్నటితో తగ్గిన కొవిడ్ తీవ్రత.. దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?

Covid 19 Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే కేసులు కాస్త తగ్గినా.. రోజువారి కేసులు 17వేలకు పైగానే నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 17 వేల 070 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే దాదాపు వెయ్యి కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో మరో 23 మంది కొవిడ్ తో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 139కి పెరిగింది.

గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  14 వేల 413 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా ఏడు వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.55 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.24 శాతానికి పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. నిన్న 11 లక్షల 67వేల 41 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 197 కోట్ల 74 లక్షల 71 వేల 41 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మరో మూడు వారాల పాటు కొవిడ్ కేసుల తీవ్రత ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు పాటించడం కంపల్సరి అని హెచ్చరిస్తున్నాయి.

Read also: LPG Cylinder Price: ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర..  

Read also: TRS VS BJP: ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో ఏం జరగబోతోంది?   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News