Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథుడి రథయాత్రకు సిర్వం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు రథయాత్రి ప్రారంభం కానుంది. ఇప్పటికే పూరీ భక్తజనసంద్రమైంది. గురువారమే లక్షలాది భక్తులు జగన్నాథుడి ఆలయానికి పోటెత్తారు. పూరీ వీధులన్ని భక్తులతో నిండిపోయాయి. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా జగన్నాథుడి రథోత్సవానికి భక్తులను అనుమతించలేదు. రెండేళ్ల తర్వాత జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనే భాగ్యం దక్కడంతో గతంలో కంటే ఈసారి భక్తులు ఎక్కువగా పూరీకి తరలివస్తున్నారు. ఈసారి రథయాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
గతంలో కంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఒడిషా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రథయాత్ర కోసం తూర్పు కోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అన్ని ప్రాంతాల నుంచి మరో వెయ్యి బస్సులు నడుపుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే జనాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా పోలీసులు అత్యున్నత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐదెంచల బందోబస్తు ఏర్పాటు చేశామని ఒడిషా డీజీపీ సునీల్ బన్సల్ తెలిపారు. రథయాత్రలో తొక్కిసలాటకు తావు లేకుండా బందోబస్తు చేశామని తెలిపారు. శుక్రవారం రోజున ఈ ప్రాంతాన్ని ‘నో ఫ్లయింగ్ జోన్’ చేయాలని విమానాశ్రయ యంత్రాంగాన్ని కోరామని చెప్పారు డీజీపీ.
భగవాన్ జగన్నాథ్, దేవి సుభద్ర మరియు బలభద్ర భగవానుల రథోత్సవం అని కూడా పిలువబడే రథయాత్ర ఒడిశాలోని పూరీ నగరంలో అత్యంత ప్రముఖమైన హిందూ పండుగ.జగన్నాథుడి రథయాత్ర ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది. దాని ప్రకారం ఈ సంవత్సరం ఉత్సవం జూలై 1న రథయాత్ర మొదలు కానుంది. ప్రతి సంవత్సరం వార్షిక రథోత్సవం కంటే ముందుగా మూడు రథాలు కొత్తగా నిర్మిస్తారు. ఊరేగింపునకు నందిఘోష్ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్ (సుభద్ర) రథాలు సిద్ధమయ్యాయి. ఏటా జరిగే ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు. రథయాత్రలో చేరిన భక్తులు జగన్నాథుని రథాన్ని లాగడం తమ వరమని భావిస్తారు.
ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ సందేశంతో అద్భుతమైన ఇసుక కళను రూపొందించారు: ఈ రథయాత్రలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేద్దామని ప్రతిజ్ఞ చేద్దామంటూ పట్నాయక్ పిలుపిచ్చారు. జగన్నాథ రథయాత్రకు గుర్తుగా పట్నాయక్ 125 ఇసుక రథాలను తయారు చేశారు. ఇది రికార్డ్ కానుంది.
Read also: Online Tickets: జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకంపై హైకోర్టు స్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook