Jaggareddy on Revanth: తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో ఇది మరోసారి బహిర్గతమైంది. ఆయన పర్యటనకు దూరంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఐతే యశ్వంత్ సిన్హాను స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు వెళ్లారు. ఈ విషయాన్ని రేవంత్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పార్టీ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన వారిని బండకేసి కొడతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.
ఈనేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పీసీసీ హోదాలో ఉండి తొందరపడి మాట్లాడొద్దన్నారు. బండకేసి కొట్టడానికి నువ్వు ఎవరు..తామేమన్న పని వాళ్లమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీల ముందు మాట్లాడిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొందరపడే వాడివి పీసీసీ పోస్ట్‌లో ఎలా పని చేస్తావని ప్రశ్నించారు. హన్మంతరావు 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్నారని..ఆయనను ఎవరు అని అంటావా అంటూ మండిపడ్డారు.
ఇది ఏం పద్దతి అని..కాంగ్రెస్‌ని నువ్వు ఏమన్న రాసుకున్నావా ప్రశ్నించారు జగ్గారెడ్డి. సోనియా గాంధీ వల్లే పీసీసీ అయ్యావన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తక్షణమే రేవంత్‌రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. నెల రోజులకోసారి జరిగే పీఏసీ మీటింగ్, ఇతర సమావేశాలను ఎందుకు పెట్టడం లేదన్నారు జగ్గారెడ్డి. ఇంట్లో కూర్చుని పార్టీని డైరెక్షన్ చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. పీసీసీ హోదా రేవంత్‌రెడ్డికి సరిపోదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, వీహెచ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.
Also read: Madhucon Company: రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే కేసులో ఈడీ విచారణ..విలువైన ఆస్తుల జప్తు..!
Also read: Nupur Sharma: దుమారం రేపుతున్న నుపుర్ శర్మ వ్యాఖ్యలు..తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook