Raghu Rama Krishna Raju: న్యాయ స్థానాల్లో ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆయనకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై, తన కుమారుడిపై గచ్చిబౌలి పీఎస్‌లో నమోదు అయిన కేసును కొట్టి వేయాలని ధర్మాసనంలో ఆయన పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. కేసు కొట్టి వేసేందుకు కోర్టు నిరాకరించింది. రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌ను కొట్టి వేసింది.
ఇంటలిజెన్స్ కానిస్టేబుల్‌ను రఘురామ కుటుంబసభ్యులు ఇంట్లో నిర్భందించి దాడి చేశారని ఈసందర్భంగా కోర్టుకు పోలీసులు వివరించారు. తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈకేసులో నిందితులుగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారని తెలిపారు. దీనిపై రఘురామ కృష్ణం రాజు తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదన విన్న కోర్టు..పోలీసుల వాదనతో ఏకీభవించింది. రఘురామకృష్ణం రాజు పిటిషన్‌ను నిరాకరించింది.
Also read: PM Modi on Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని అబే మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..!
Also read: Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook