Prabhas Remuneration became hot topic: ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు ఇండియా సినీ పరిశ్రమలో టాప్ హీరోగా నిలిచారు. ఇప్పుడు ఇండియా మొత్తం మీద అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలలో ప్రభాస్ ముందు వరుసలో నిలిచారు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు ప్రభాస్. దీంతో ఆ తర్వాత ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదిస్తున్నాయి.
ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే అది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదలవ్వాల్సిందే. ఇక ఆ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నిజానికి రాధేశ్యామ్ సినిమా రిలీజ్ ముందు వరకు ప్రభాస్ రెమ్యూనరేషన్ 100 కోట్ల రూపాయలుగా చార్జి చేసేవారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి విశ్రమ స్పందన తెచ్చుకున్నాక ప్రభాస్ తన వెంట పడుతూ ఇబ్బంది పెడుతున్న నిర్మాతలను కొంచెం దూరం పెట్టాలని నిర్ణయించి 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారు.
అంటే ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు చేయడానికి కూడా దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు. వారి లెక్కల వారికి ఉంటాయి కదా. అదేమంటే ప్రభాస్ సినిమా కనుక ఒక హిట్ టాక్ తెచ్చుకుంటే 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఈజీ అని భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఒక ఆసక్తికర లెక్క బయటకు వచ్చింది.
అదేమిటి అంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ప్రకటించినవి, ప్రకటించాల్సినవి కలిపి ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ లెక్కన సుమారు ఆయనకు ఐదు నుంచి 600 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ రాబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ హోటల్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ డబ్బులలో కేవలం కొంత భాగాన్ని ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతారు అని తెలుస్తోంది. మిగతా డబ్బుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో భూములు కొనుగోలు చేయడానికి ఆయన సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక దుబాయ్ సహా స్పెయిన్ దేశాలలో నిర్మిస్తున్న హోటల్స్ కు బాహుబలి పేరు కానీ దానికి సంబంధించిన ఏదైనా ఇతర పేర్లను గాని వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: Priya Anand: నిత్యానందతో ప్రియా ఆనంద్ పెళ్లి.. సింక్ కోసం రెడీ అంటున్న భామ!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.