Sarandeep Singh slams BCCI: ఇంగ్లండ్ పర్యటన అనంతరం వెస్టిండీస్ టూర్‌కు భారత్ వెళ్లనున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే వన్డే జట్టును ప్రకటించిన బీసీసీఐ.. గురువారం 18 మంది సభ్యులతో కూడిన టీ20 జట్టును కూడా ప్రకటించింది. అందరూ అనుకున్న విధంగానే ఫామ్‌లో లేని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. వన్డే జట్టులో కూడా కూడా విరాట్ లేడన్న విషయం తెలిసిందే.
గత మూడేళ్లుగా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. పరుగుల వరద పారించే కోహ్లీ బ్యాట్ మూగబోయింది. గత మూడేళ్లుగా ఒక్కక్క సెంచరీ కూడా చేయలేదు. దాంతో విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఇంగ్లండ్ గడ్డపైనా కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రికెట్‌కు కొంతకాలం విరామం తీసుకొని మళ్లీ రావాలని కోహ్లీకి మాజీలు సూచిస్తున్నారు. ఇది పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ వెస్టిండీస్ టూర్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది ఎందుకు చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదని, రెస్ట్ ఇస్తే ఫామ్‌లోకి వస్తాడా? అని ప్రశ్నించారు.
'నాకు ఇప్పటికీ అర్థంకాని విషయం ఏంటంటే.. విశ్రాంతి అంటే ఏంటి?, ఎప్పుడు తీసుకోవాలి?. 100ల పరుగులు చేసినప్పుడే విశ్రాంతి గురించి ఆలోచించాలి. ఒకవేళ విరాట్ కోహ్లీ గత 3-4 నెలల్లో 4-5 సెంచరీలు చేసి అలసిపోతే అప్పుడు విశ్రాంతి తీసుకొనే స్వేచ్ఛ ఉండేది. ఐపీఎల్ 2022కి ముందు కోహ్లీ ఆడింది రెండు టెస్టులు మాత్రమే. తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడలేదు. మైదానం బయట కూర్చోవడం, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఫామ్‌లోకి రాలేం. బీసీసీఐ ఏం చేస్తుందో అర్ధం కావట్లేదు' అని శరణ్‌దీప్ సింగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
Also Read: ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. కలిసిపోయిన ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా (వీడియో)!
Also Read: Hero Sushanth: యాంకర్ పై సుశాంత్ ఆగ్రహం.. ఆ పద్ధతి కరెక్ట్ కాదంటూ ఫైర్!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
బీసీసీఐ ఏం చేస్తుందో అర్ధం కావట్లేదు.. విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇస్తే ఫామ్‌లోకి వస్తాడా: మాజీ సెలెక్టర్
బీసీసీఐ ఏం చేస్తుందో అర్ధం కావట్లేదు
విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇస్తే ఫామ్‌లోకి వస్తాడా
కోహ్లీపై విమర్శల వర్షం