Shiv Sena: శివసేన పార్టీ నాయకత్వ హక్కుల కోసం పోటీ తీవ్ర తరం అవుతోంది. నువ్వానేనా అన్నట్లు ఉద్దవ్ ఠాక్రే, షిండే వర్గాలు తలపడుతున్నాయి. తాజాగా ఈ అంశాన్ని ఉద్దవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుకు తీసుకెళ్లింది. పార్టీ నాయకత్వ హక్కులపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆపాలని పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టులో ఉండగా..ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఠాక్రే వర్గం ప్రశ్నించింది.
త్వరలో దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. శివసేన సంక్షోభంతో మహారాష్ట్రలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో అక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈక్రమంలో ఉద్దవ్ ఠాక్రే ..సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం షిండే వర్గీయులు ముంబైకి చేరుకున్నారు. బీజేపీ మద్దతుతో తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అనంతరం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సునాయాసంగా గెలిచారు. ఆ తర్వాత శివసేన పార్టీ కోసం ఇరువర్గాల మధ్య పోటీ నెలకొంది. అసలైన శివసేన తమదేనంటూ శిండే వర్గం చెబుతోంది. ఈనేపథ్యంలో లోక్‌సభలోనూ శివసేన రెండు ముక్కలైంది. 18 మంది ఎంపీల్లో 12 మంది సభ్యులు షిండే వర్గంలోకి చేరారు. దీంతో చీలిక మరింత తీవ్రమయ్యింది. ఈక్రమంలో శివసేన పార్టీ తమదేనని..గుర్తు తమకే ఇవ్వాలంటూ షిండే వర్గం ఈసీని ఆశ్రయించింది.
ఇటు ఉద్దవ్ వర్గం సైతం ఈసీకి లేఖలు రాసింది. కొందరు తమ పార్టీ ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని..వాటిని ఆపాలని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఈసీ..కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 లోపు పార్టీలో ఇరువర్గాలు తమ మెజార్టీకి సంబంధించిన పత్రాలను ఇవ్వాలని ఆదేశించింది. పార్టీలోని పరిణామాలను సైతం వివరించాలని తెలిపింది. ఇరుపక్షాల వివరణ తర్వాత పార్టీ ఎవరికి చెందాలన్న దానిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. ఈక్రమంలోనే ఉద్దవ్ వర్గం సుప్రీం కోర్టుకు వెళ్లింది.
Also read:Minister Harish Rao: ఇకపై ఇంటింటికి బూస్టర్ డోస్ పంపిణీ..మంత్రి హరీష్‌రావు కీలక రివ్యూ..!
Also read:IND vs WI: విండీస్ గడ్డపై టీమిండియా సరికొత్త రికార్డు..ఆటగాళ్ల సంబరాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.