Pakistan announce squad for Asia Cup 2022: ఆగష్టు చివరి వారంలో ఆరంభం కానున్న ఆసియా కప్ 2022కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. ఆసియా కప్‌తో పాటు నెదర్లాండ్స్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పీసీబీ బుధవారం మరో టీంను ప్రకటించింది. నెదర్లాండ్స్ సిరీస్, ఆసియా కప్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సారథ్యం వహించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ హసన్ అలీకి పాక్ జట్టులో చోటు దక్కలేదు. అతడికి విరామం ఇస్తున్నట్లు పీసీబీ పేర్కొంది. హసన్ స్థానంలో నసీమ్ షా ఎంపికయ్యాడు.
యువ పేసర్ అయిన నసీమ్ షా ఇప్పటికే టెస్టుల్లో అరగేంట్రం చేయగా.. త్వరలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అరగేంట్రం చేయనున్నాడు. నెదర్లాండ్స్, ఆసియా కప్ ఎంపిక చేసిన పాక్ జట్లలో అతడికి చోటు దక్కింది. 19 ఏళ్ల నసీమ్ తన అరంగేట్ర టెస్టులోనే ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన పేసర్ షాహీన్ షా అఫ్రిది తుది జట్టులోకి వచ్చాడు. సల్మాన్ అలీ ఆఘా కూడా వన్డే జట్టులోకి వచ్చాడు. మొత్తానికి పాక్ పటిష్టంగా ఉంది.
నెదర్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 16న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. నెదర్లాండ్ వన్డే సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఆసియా కప్ 2022లో పాల్గొంటుంది. ఆసియా కప్‌లో భాగంగా పాక్ తమ తొలి మ్యాచ్‌లో టీమిండియాతో తలపనుంది. దాయాదుల మధ్య పోరు ఆగస్టు 28న జరగనుంది. ఆసియా కప్ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుంది.
నెదర్లాండ్స్ కోసం పాక్ జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మెహమూద్.
ఆసియా కప్ కోసం పాక్ జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ దహానీ, ఉస్మాన్ ఖదీర్.
Also Read: నేను గెలిచినందుకు ఆనందమే కానీ.. అందుకు బాధగా ఉంది: పీవీ సింధు
Also Read: నెట్టింట జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ వీడియోలు.. పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook